వేగంగా జరుగుతున్న"గోపాల గోపాల"షూటింగ్

0

Gopala Gopala Movie Opening (2)గత ఏడాది విడుదలయిన బాలీవుడ్ బ్లాక్బస్టర్ మూవీ “ఓ మై గాడ్” చిత్రాన్ని తెలుగులో వెంకటేష్ , పవన్ కల్యాణ్ ప్రధాన పాత్రల్లో “గోపాల గోపాల” గ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. డాలీ దర్సకత్వం వహిస్తున్న ఈ చిత్రమలో వెంకటేష్ సరసన శ్రియ నటిస్తోంది. శరత్‌మరార్, సురేష్‌బాబు నిర్మాతలు.

పవన్ కల్యాణ్ మోడరన్ కృష్ణుడు పాత్రలో కనిపిస్తాడు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో చిత్ర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ”భూకంపం కారణంగా తనకు జరిగిన అన్యాయానికి ప్రకృతే కారణమని నష్టపరిహారం ఇవ్వడానికి బీమా సంస్థ నిరాకరిస్తుంది. ఆ సమయంలో ఆ వ్యక్తి ఏం చేశాడనే అంశం ఆధారంగా చిత్రం రూపొందుతోంది. పవన్ కల్యాణ్, వెంకటేష్ కలయికలో చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. స్వామీజీగా మిథున్ చక్రవర్తి నటన చిత్రానికి ప్రధానాకర్షణగా నిలుస్తుంది” అంటోంది చిత్రబృందం.

సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రంలో కృష్ణుడు, మధుశాలిని, వెన్నెల కిషోర్, దీక్షా పంత్ తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం: జయనన్ విన్సెంట్, కూర్పు: గౌతంరాజు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts