'వెయ్ రాజా వెయ్' తాప్సి.

0

tapseeకొత్త పాత్రల్లోకి పరకాయ ప్రవేశం చేయడమంటే తాప్సికి భలే సరదా. తన దగ్గరికి వచ్చే కథల్లోనూ, పాత్రల్లోనూ కాసింత కొత్తదనం ఉందనిపిస్తే చాలు… ఇతరత్రా విషయాల గురించి ఏమీ ఆలోచించకుండా ఆ సినిమా చేయడానికి పచ్చజెండా వూపేస్తుంటుంది. తమిళంలో ‘వెయ్ రాజా వెయ్’ అనే చిత్రం చేయడం వెనక కారణం అదే. ఇందులో తాప్సి జూదం ఆడే యువతిగా కనిపిస్తుందట. ఆ పాత్ర నటిగా నాకు ఓ కొత్త రకమైన అనుభవాన్నిచ్చిందని చెబుతోంది. మరి మీరెప్పుడైనా జూదం ఆడారా అని అడిగితే… ”నాకస్సలు అలవాటు లేదు. ‘వెయ్ రాజా వెయ్’ సినిమా కోసమే తొలిసారి క్యాసినోలోకి అడుగుపెట్టాను. కష్టపడి సంపాదించిన సొమ్మును అలా జూదానికి బలిచేయడం నాకు నచ్చదు. నేనే కాదు… అలాంటివి నా స్నేహితులకు కూడా సిఫారసు చేయను” అని చెప్పుకొచ్చింది. ముంబైకి మకాం మార్చాక తాప్సికి మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. అక్షయ్ కుమార్‌తో కలిసి ‘బేబి’ అనే చిత్రంలో నటిస్తోంది. యాక్షన్ ప్రధానమైన ఆ చిత్రంలో తాప్సి ప్రాధాన్యమున్న పాత్ర చేస్తోంది. అందుకోసం ప్రత్యేకమైన యుద్ధ విద్యలు కూడా నేర్చుకుంటోందని సమాచారం. ”ఇదివరకటిలా మూసలో సాగిపోయే పాత్రలకి ఇప్పుడు దూరమయ్యాను. ఆ తరహా పాత్రలు నా దగ్గరికి కూడా రావడం లేదు. ఇప్పుడు సాగుతున్న ప్రయాణం అంతా కొత్త కొత్తగా ఉంద”ని చెప్పుకొచ్చింది తాప్సి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts