విభిన్న నేపథ్యంలో..

0

shilpaటాలీవుడ్‌కు మరో కొత్త అందం పరిచయం కానుంది. మాజీ మిస్ ఇండియా యూనివర్స్ శిల్పా సింగ్ ప్రధాన పాత్రలో ఓ నూతన చిత్రం తెరకెక్కుతోంది. అనూప్ బండారిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఎమ్.జి, ఎమ్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిరూప్, అవంతిక శెట్టి, రాధిక చేతన్ నాయకానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ భిన్న నేపథ్యంలో ఈ సినిమా వుంటుంది. వర్డ్స్ అనే లఘు చిత్రంతో అనేక అవార్డులను అందుకున్న అనూప్ బండారిని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేయడం ఆనందంగా వుంది. ప్రముఖ హీరో కీలక పాత్రలో నటిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, కేరళ తదిరత ప్రాంతాలలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తాం. శిల్పా సింగ్ గ్లామర్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. అన్ని వాణిజ్య అంశాలు మేళవించిన ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుంది అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: మురళి గంధర్వ, సంగీతం: ఆగం రాక్ బ్యాండ్, ఎడిటర్: ప్రవీణ్ కుమార్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts