వినోదంతో ఢీ అంటే ఢీ

0

srikanthశ్రీకాంత్, సోనియామాన్ జంటగా మహాలక్ష్మీ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రానికి ఢీ అంటే ఢీ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో దాసరి నారాయణరావు ఈ సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొన్నలగడ్డ శ్రీనివాస్ మా సంస్థలో బంగారుబాబు చేశాడు. ఈ సినిమా తరువాత అతను కొంత విరామం తీసుకొని స్వీయదర్శకత్వం వహిస్తూ ఈ సినిమా చేస్తున్నాడు. శ్రీకాంత్ ఇప్పటికీ డేంజర్ జోన్‌లోకి వెళ్లకుండా సాఫీగా సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అతని సినిమాలకు ఇప్పటికీ మంచి క్రేజ్ వుంది. ఢీ అనేది సక్సెస్‌ఫుల్ టైటిల్. ఈ సినిమా తప్పకుండా జొన్నలగడ్డ శ్రీనివాస్‌కు బ్రేక్‌నిస్తుంది అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ మూడు పాటలు మినహా టాకీ పూర్తయింది. ఇందులో రెండు యుగళగీతాలు, ఒకటి ఐటమ్ సాంగ్. రెండు పాటల్ని త్వరలో ఫారిన్‌లో చిత్రీకరించాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ భూపతిరాజా కథ చెప్పినప్పుడే సినిమా బాగుంటుందని అనిపించింది. కథకు తగ్గట్లు చక్కని టైటిల్‌ని ఖరారు చేశారు. టాప్ టెక్నీషియన్‌లు, నటీనటులంతా కలిసి పనిచేస్తున్న సినిమా ఇది అన్నారు. ఎంతో బాధ్యతతో తీస్తున్న సినిమా ఇది. యాక్షన్, చైల్డ్ సెంటిమెంట్‌తో పాటు పాత్రల మధ్య గమ్మత్తైన సవాల్‌లతో ఢీ అంటే ఢీ అంటూ కథ సాగుతుంది. పూర్తిస్థాయి వినోదభరితంగా సాగే ఈ చిత్రానికి బ్రహ్మానందం పాత్ర ప్లస్ పాయింట్ అవుతుంది అని రచయిత రాజేంద్రకుమార్ తెలిపారు. చలపతిరావు, పోసాని,సత్యకృష్ణ, రఘు కారుమంచి, తాగుబోతు రమేష్, దువ్వాసి, గుండు హనుమంతరావు తదితరులు నటిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts