విడుదలకు ముందే 200కోట్లు?

0

SHARUK-LRGహిందీ చిత్రసీమలో అగ్రహీరోల చిత్రాలన్నీ 200కోట్ల కలెక్షన్ల మైలురాయిని నిర్ధేశించుకుని నిర్మాణం జరుపుకుంటున్నాయి. ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడానికి సదరు చిత్రాల ప్రచారాల్ని వినూత్న రీతుల్లో నిర్వహిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారూఖ్‌ఖాన్ తన తాజా చిత్రం హ్యాపీ న్యూఇయర్ కోసం మునుపెన్నడూలేని విధంగా సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. సినిమా విడుదలకు ముందే 200కోట్లను ఆర్జించే సరికొత్త పథకాన్ని సిద్ధం చేశారాయన. స్వీయనిర్మాణంలో హ్యాపీ న్యూఇయర్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో బిజినెస్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు షారూఖ్. అందులోభాగంగా సినిమా విడుదలకు మూడునెలలు ముందుగానే చిత్రబందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంపికచేసిన నగరాలలో భారీ ప్రదర్శనలివ్వబోతున్నారు.

ఈ కార్యక్రమాల ప్రసార హక్కుల కోసం అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన వ్యాపార సంస్థలు భారీ మొత్తాల్ని ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయట. దీంతో సినిమా విడుదలకు ముందే 200కోట్ల లాభాన్ని పొందవచ్చని షారూఖ్ ఆలోచిస్తున్నాడని చిత్ర బందం వెల్లడించింది. ఈ ప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయంలో నటీనటులకు కూడా వాటా వుంటుందని నిర్ణయించడంతో వారందరూ నెలరోజులు డేట్స్ కేటాయించారని తెలిసింది. ఫరాఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికాపదుకునే, అభిషేక్‌బచ్చన్, సోనూసూద్ ముఖ్యపాత్రల్ని పోషిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్‌లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకురానుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

"సత్య గ్యాంగ్" సాంగ్స్ సూపర్ అంటున్నారు!!
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాప...
స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
powered by RelatedPosts