విడిపోయిన మరో సినీ జంట

0

సినీ పరిశ్రమలో నటీనటులు ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకోవడం సర్వ సాధారణం. అయితే, ఎన్నాళ్లు ఆ పెళ్లిని వారు నిలబెట్టుకోగలరు అన్నదే ఇక్కడ ప్రశ్న. ఎందుకంటే అందరూ బాలీవుడ్ లో అమితాబ్- జయా బచ్చన్ లా, టాలీవుడ్ లో కృష్ణ- విజయనిర్మల లా ఉండరు కదా. అందుకు నిదర్శనమే ఈ జంట. తమిళ నటుడు రంజిత్, నటి ప్రియారామన్ దంపతులు విడిపోయారు. వీరు కోర్టు ద్వారా చట్టబద్దంగా వివాహ రద్దు పొందారు. తమిళంలో పొన్ విళంగు, సింధునదీ పూ, వట్టాకుడి ఇరణియన్ తదితర చిత్రాల్లో నటించిన రంజిత్, సూర్య వంశం, పొన్‌మనం, హరిచంద్ర, పుదుమై పిత్తన్, చిన్న రాజా చిత్రాలలో హీరోయిన్‌గా నటించిన ప్రియా రామన్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి 1999లో నేశం పుదుసు అనే చిత్రంలో నటించారు.

ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ మొలకెత్తింది. ఈ చిత్రంలోని పెళ్లి సన్నివేశం కోసం రంజిత, ప్రియారామన్‌ల నిజ వివాహాన్ని చిత్రీకరించారు. వీరికి ఆదిత్య, ఆకాష్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో గత ఏడాది రంజిత్, ప్రియారామన్ మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరు విడివిడిగా జీవిస్తున్నారు. అలాగే చట్టబద్ధంగా విడాకులు పొందాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. దీంతో తాంబరం కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకులు పిటిషన్ దాఖలు చేసుకున్నారు.

ఈ కేసు విచారించిన కోర్టు ఈ నెల ఆరో తేదీన రంజిత్ ప్రియారామన్‌కు విడాకులిస్తూ తీర్పునిచ్చిందని నటుడు రంజిత్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తాను ప్రియారామన్ 15 ఏళ్ల పాటు కలిసి జీవించామన్నారు. అలాంటిది తమ మధ్య భావసారూప్యం కొరవడిందని అనుభవపూర్వకంగా తెలియడంతో ఆపై భార్య భర్తలుగా జీవించలేకపోయామన్నారు. అయితే మంచి స్నేహితులుగా గడపవచ్చనే నమ్మకం ఏర్పడిందని తెలిపారు. ఈ విషయాల్లో ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చి విడిపోయామని తెలిపారు. పిల్లలు ప్రియారామన్‌తోనే ఉంటున్నారని చెప్పారు. మనస్పర్థల కారణంగా నటనపై దృష్టి సారించలేకపోయానని ఇకపై పూర్తిగా నటనపై శ్రద్ధ చూపిస్తానని రంజిత్ తెలిపారు.

నటన మీద శ్రద్ధ సరే నాయనా, ఆ శ్రద్ధ ఏదో పిల్లలకోసం అయినా విడిపోకుండా ఉండటంలో చూపించి ఉంటే బాగుండేది…. ప్చ్..

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts