విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన సూపర్ హిట్ కళావతి

0

 

విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన సూపర్ హిట్ కళావతి

ఇండ‌స్ట్రీ ఏదైనా.. హార్ర‌ర్ కామెడీస్ కు కావాల్సినంత డిమాండ్ ఉంది. ఈ క్రేజ్ నే క్యాష్ చేసుకుంటూ ఇప్ప‌టికే బోలెడ‌న్ని సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు అదే దారిలో ఇటీవలే విడుదలైంది కళావతి చిత్రం. హన్సిక, త్రిష, సిద్దార్థ్, సుందర్ సి, పూనమ్ బాజ్వా, కోవై సరళ, మనోబాల, సూరి వంటి స్టార్స్ నటించిన ఈ చిత్రం భారీ కలెక్షన్స్ తో రెండో వారంలోకి దూసుకెళ్లింది. సర్వంత్రామ్‌ క్రియేషన్స్ మ‌రియు ఈరోజుల్లో, రోమాన్స్ లాంటి ప‌లు విజయవంతమైన చిత్రాల్ని అందించిన గుడ్ సినిమా గ్రూప్ తెలుగు ప్రేక్షకులకు అందించారు. సుందర్ సి దర్శకుడు.  శ్రీ జవ్వాజి రామాంజనేయులు చిత్ర స‌మ‌ర్ప‌కులు. డబ్బింగ్ సినిమా అయినప్పటికీ… తెలుగు చిత్రాల్ని తలదన్నేలా కలెక్షన్స్ వస్తుండడంతో… డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉన్నారు. రెండో వారంలోకి విజయవంతంగా దూసుకెళ్లిన సందర్భంగా
నిర్మాతలు మాట్లాడుతూ…. ఈ మధ్యకాలంలో డబ్బింగ్ చిత్రాలకు ప్రేక్షకుల నుంచి సరైన ఆదరణ లభించలేదు. అలాంటి సమయంలో వచ్చిన కళావతి డ‌బ్బింగ్ సినిమానే అయినా.. తెలుగులో అద్భుతమైన కలెక్షన్స్ తో రెండో వారంలోకి అడుగుపెట్టింది. సూపర్ ఓపెనింగ్స్ తో కళావతి… థియేటర్లు కళకళలాడేలా చేసింది. డ‌బ్బింగ్ సినిమా అయినా ప్రేక్షకులు స్ట్రెయిట్ చిత్రాలకు ధీటుగా ఆదరించారు. పలు పెద్ద చిత్రాల నడుమ విడుదలైనప్పటికీ… కళావతి క్రేజీగా కలెక్షన్స్ సాధిస్తోంది. హ‌న్సిక అభినయం, త్రిష అందాల విందు, సిద్దార్థ్, పూన‌మ్ బ‌జ్వా, లాంటి స్టార్స్ ఉండడంతో సినిమాకు మంచి ఓపెనింగ్స్ దక్కాయి. సూరి, కోవై సరళ, మనోబాల కాంబినేషన్ కామెడీకి జనాలు కడుపుబ్బ నవ్వుతున్నారు. సుందర్ సి… డైరెక్షన్ టేకింగ్ తో సినిమా ఘనవిజయం సాధించింది. కళావతిని సూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అని అన్నారు.
సమర్పణ – శ్రీ జవ్వాజి రామాంజనేయులు
నటీనటులు – సుందర్ సి, సిద్ధార్థ, త్రిష, హన్సిక, పూనమ్ బాజ్వా, సూరి, కోవై సరళ, రాధా రవి
సంగీతం – హిప్ హాప్ తమిఝా
దర్శకుడు – సుందర్ సి
నిర్మాత – గుడ్ ఫ్రెండ్స్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాక‌థ‌లో నేను
న‌టీన‌టులు: సాంబ శివ‌, సంతోషి వ‌ర్మ‌, సుహాష్‌, అప్ప‌ల‌రాజు, భానుర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం-నిర్మాత‌: శివ‌ప్ర‌సాద్ గ్రందె సంగీతం: న‌వ‌నీత్‌ కెమ...
క‌ల్యాణ్ రామ్ హీరోగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం ప్రారంభం
నంద‌మూరి క‌ల్యాణ్ రామ్, నివేదా థామ‌స్‌, షాలిని పాండే హీరో హీరోయిన్లుగా ఈస్ట్‌కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం బుధ‌వారం హైద‌రాబాద్ ర...
మే రెండవ వారం రిలీజ్ సన్నాహాలలో `ద‌మ్ముంటే సొమ్మేరా`
  సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తమిళ్ రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని ...
powered by RelatedPosts