వాళ్ళిద్దరి పాటలే అంతా పాడుకుంటున్నారు

0

s-s-Thamanప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో అదరగొడుతున్న సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్. ఈ తరం హీరోలందరికీ తమన్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. రిచ్ సౌండ్ క్వాలిటీ, సరికొత్త కాంపోజిషన్ తో పదికి, ఎనిమిది సినిమాలు చేస్తున్న తమన్ తాజాగా స్వరపరిచిన రెండు పాటలు మ్యూజిక్ చార్ట్లో టాప్ లో ఉన్నాయి. ఏమా పాటలు… ఏమిటా కథ ఒకసారి చూద్దాం.

తను మ్యూజిక్ అందించిన రెండు స్టార్ హీరోల సినిమాల ఆడియో ఇటీవలే విడుదలయ్యాయి. అవే ఎన్.టి.ఆర్ నటించిన ‘రభస’, రవితేజ నటించిన ‘పవర్’. ఈ రెండు సినిమాల్లోని ‘రాకాసి’, ‘నోటంకి’ సాంగ్స్ ప్రస్తుతం మ్యూజిక్ చార్ట్ లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఒక్క వారం కాదు, రిలీజ్ అయిన రోజు నుంచి మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉన్నాయి.ఇక్కడ చెప్పుకోవాల్సిన మరొక విషయం ఏమిటంటే.. ఈ రెండు పాటలను ఆ సినిమా హీరోలే పాడడం.. ‘రాకాసి రాకాసి’ సాంగ్ ని ఎన్.టి.ఆర్ పాడితే, ‘నోటంకి’ పాటని రవితేజ పాడాడు.

ఇలా తను మ్యూజిక్ చేసిన పాటలు మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉండడంతో తమన్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇదే విషయం పై ఓ రేడియో చానల్లో ఎన్.టి.ఆర్ మాట్లాడుతూ ‘తమన్ నా సినిమాకి చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మామూలుగా నేను బాత్ రూం సింగర్ ని.. కానీ నా చేత ఫుల్ సాంగ్ పాడించాడు. అంతే కాకుండా అది మ్యూజిక్ చార్ట్ లో టాప్ లో ఉండడం మరింత ఆనందంగా ఉంది. థాంక్స్ తమన్ అని’ అన్నాడు.

ఎన్టీఆర్ పొగడ్త తమన్ కి ఎంతలేదన్నా మరో నాలుగు సినిమాలొచ్చేలా చేస్తుందనడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు…. ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప‌వ‌న్ టైటిల్ `రాజా వ‌చ్చినాడు`!
పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్లో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈచిత్రానికి ...
మెగాస్టార్ 151వ సినిమా `ఉయ్యాలవాడ` మొద‌లైంది
మెగాస్టార్‌ చిరంజీవి 151వ చిత్రం ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ చిత్రం నేడు హైద‌రాబాద్ లో మొదలైంది. కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయంలో పూజా కార్యక...
సాయిధరమ్‌తేజ్‌, ఎ.కరుణాకరన్‌ కాంబినేషన్‌లో కె.ఎస్‌.రామారావు భారీ చిత్రం ప్రారంభం
సుప్రీమ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌ హీరోగా ఎ.కరుణాకరన్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత కె...
powered by RelatedPosts