వాడియా.. రాముడు కాదు కృష్ణుడే!!

0

imagesప్రీతి జింటాతో డిష్యుం డిష్యుం అన్నట్లున్న నెస్ వాడియా.. ఇప్పటికీ ఆమె తనకు మంచి స్నేహితురాలే అని చెబుతున్నా, ఇద్దరి మధ్య పరిస్థితి ఎలా ఉందో మాత్రం అందరికీ తెలుసు. మాజీ ప్రియుడు తనను కొట్టాడని, వేధిస్తున్నాడని ప్రీతిజింటా ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేసేవరకు వెళ్లింది. అయితే, దాదాపు ఐదేళ్ల పాటు ప్రీతి – వాడియా స్నేహబంధం కొనసాగింది. దానికి ముందు, ఆ తర్వాత, మధ్యలో కూడా నెస్ వాడియా మరికొందరు బాలీవుడ్ భామలతో చెట్టపట్టాలు వేసుకునే తిరిగాడని ముంబై వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

రాక్స్టార్ చిత్రంతో ఒక్కసారిగా తారాపథంలోకి దూసుకెళ్లిన నర్గీస్ ఫక్రీ.. నెస్ వాడియాతో రాసుకు పూసుకుని తిరిగి, వార్తల్లో నిలిచింది. రాక్స్టార్ సినిమా ప్రీమియర్ షో ముగియగానే, కరణ్ జోహార్ పుట్టినరోజు పార్టీలో నర్గీస్ ఫక్రీ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా హీరో రణ్బీర్ కపూర్ రాకపోయినా.. నెస్ వాడియా రూపంలో ఆమెకు ఆ పార్టీలో మంచి కంపెనీయే దొరికింది. వాళ్లిద్దరూ దాదాపు గంట పాటు ఆ పార్టీలో ఒకరినొకరు అతుక్కుపోయి కనిపించారట. ప్రీతిజింటా కూడా ఆ పార్టీలో ఉన్నా, ఫక్రీ స్థాయిలో ఆమె వార్తల్లో నిలవలేకపోయింది.

ఒకప్పుడు లారా దత్తాతోను, అంతకంటే ముందు మనీషా కొయిరాలాతో కూడా నెస్ వాడియా కాస్త సన్నిహితంగానే మెలిగాడట. అంతేనా, అమీషా పటేల్ అన్నా కూడా వాడియా చెవి కోసుకునేవాడని బాలీవుడ్ వర్గాల్లో గుప్పుమంది. ఇప్పుడు వాళ్లంతా దూరంగా జరగడంతో.. తాజాగా బిజినెస్ టైకూన్ ఆయేషా థాపర్తో వాడియా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడని వినిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

నాగ్ అశ్విన్ చేతుల మీదుగా విడుదలైన అక్షర అహా నా పెళ్లంట కవర్ వీడియో సాంగ్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించి అందరి ప్రశంసలు అందుకున్న అక్షర గురించి ప్రత్యేక పరచయం అక్క...
Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
powered by RelatedPosts