వర్షం కలిపిన ప్రేమబంధం

0

varunsandesh (1)హదయంలో దాచుకున్న ప్రేమను ఓ అబ్బాయి తన ప్రేయసికి ఎంతగొప్పగా వ్యక్తం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ వర్షం సాక్షిగా చిత్రాన్ని తెరకెక్కించామని అంటున్నాడు చిత్ర దర్శకుడు రమణ మొగిలి. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఈ వర్షం సాక్షిగా. వరుణ్‌సందేశ్, హరిప్రియ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని బి.ఓబుల్ సుబ్బారెడ్డి, శ్రీనివాస్ చవాకుల నిర్మిస్తున్నారు. నిర్మాణానంతర పనులు తుదిదశకు చేరుకున్న ఈ చిత్రాన్ని ఈ వర్షాకాలంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ప్రేమికులు ఎలా వుండాలో, ఎలా వుండకూడదో తెలియజెప్పే చిత్రమిది. సినిమా చూశాక ప్రతి ఒక్కరూ తమ ప్రేమను ఈ చిత్రం తరహాలో వ్యక్తపరిచి వుంటే బాగుంటుంది అనుకుంటారు. వర్షంలో సాగే ఈ క్యూట్ రొమాంటిక్ లవ్‌స్టోరీలో అన్ని వర్గాల మెప్పు పొందే అంశాలున్నాయి. హరిప్రియ సీతామహాలక్ష్మీ పాత్రలో కనిపించబోతుంది. ఆమె అభినయం, గ్లామర్ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా వుంటాయి. ఈ వర్షాకాలంలో (జూలైలో) పాటలను, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం అన్నారు.

చలపతిరావు, జీవా, శివారెడ్డి, కాశీ విశ్వనాథ్, హేమ, ఢిల్లీ రాజేశ్వరి, ధన్‌రాజ్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: అనిల్ గోపిరెడ్డి, కథ: ముకుంద్‌పాండే, మాటలు: రామస్వామి, కెమెరా: మోహన్‌చంద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఎం.కిషోర్‌కుమార్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts