వరంగల్ సుందరంగా ఉందన్న సుకన్య

0

SUKANYA.తెలుగులో ఆమె చేసింది నాలుగె సినిమాలు. కానీ నాలుగు వందల సినిమాలు చేసినంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తమిళం నుండి తెలుగులోకి అనువదించబడ్డ “భారతీయుడు” చిత్రం ఆమె కెరీర్‌లో ఒక గొప్ప మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఆమె పేరే సుకన్య . వరంగల్ లో ఒక ప్రైవేటు కార్యక్రమానికి హాజరయిన సుకన్యని మీడియా పలకరించగా, ఆమె తన అనుభవాలని, ఆలోచనలని పంచుకున్నారు. ఆ వివరాలేమిటో మీరే చదవండి.

వరంగల్ నాకెంతో నచ్చింది :

‘వరంగల్ ఈజ్.. బ్యూటిఫుల్ సిటీ.. ఇక్కడి అందాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.. ఈ జిల్లా ప్రజలు చూపించే ఆదారాభిమానాలు తాను ఎన్నడూ మరచిపోను. నేను వరంగల్‌కు రావడం ఇదే మొదటిసారి. ఇక్కడికి వచ్చే ముందు నగరంలో చూడాల్సిన పర్యాటక స్థలాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలు, దేవాలయాలను ఇంటర్‌నెట్‌లో పరిశీలించా ను. ఇందులో భాగంగా ఉదయం హన్మకొండలోని వేయిస్తంభాల గుడిలోని శివలింగాన్ని, వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నా. అయితే వేయిస్తంభాల గు డిని చూడగానే మొదట ఆశ్చర్యం కలిగింది. ఇన్ని రాళ్లతో ఆలయాన్ని ఇంతపెద్దగా ఎలా క ట్టకలిగారని గుడిలో ఉన్న అధికారులను అడిగాను.

ఈ సం దర్భంగా వారు చెప్పిన వివరాలు తెలుసుకున్న తర్వాత అమేజింగ్ అనిపించింది. వేయిస్తంభాల గుడికి వెళ్లిన అనంతరం భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నాను. అయితే ముందు ఆల యంలోకి అడుగిడగానే ఎంతో ప్రశాంతత ల భించింది. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి నుంచి రావాలని అనిపించలేదు. కొద్ది సేపు కూర్చున్న తర్వాత అమ్మవారి చరిత్రను కూడా అడిగి తెలుసుకున్నాను. ఇక్కడికి వచ్చి న తనను ప్రజలు ఎంతో ఆప్యాయంగా పలకరించారు. ఇక నుంచి వరంగల్‌కు ఎప్పుడు వచ్చినా భద్రకాళి అమ్మవారిని తప్పక దర్శించుకుంటాను.

తెలుగులో చేసిన చిత్రాలు నాలుగే :

నాకు తెలుగు సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. తెలుగులో ఇప్పటివరకు పెద్దరి కం, కెప్టెన్, అధినాయకుడు, మున్నా సిని మాల్లో నటించాను. తెలుగులో డబ్బింగ్ చేసిన భారతీయుడు సినిమా ద్వారా నాకు బాగా గుర్తింపు వచ్చింది. మున్నా సినిమా ద్వారా కూడా ఆదరణ లభించింది.

భరతనాట్యం అంటే నాకు ప్రాణం:

చిన్నప్పటి నుంచి నాకు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. చిన్నతనంలో పాఠశాలకు వెళ్తున్న సమయంలో డ్యాన్సర్ గా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. తర్వాత నటిగా రంగప్రవేశం చేశాను. తమిళంలో 1991లో ‘పొద్దునెల్లు.. పొద్దు నత్తు’ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు, కన్నడం, తమిళం, మళయాళం భాషల్లో నటించాను. తమిళంలో 44, మళయాళంలో 17, కన్నడంలో 2, తెలుగులో 4 చిత్రాలు నటించాను. తమిళంలో 1992 సంవత్సరంలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు వచ్చింది. అలాగే 5 ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి.
మళయాళంలో ‘లైఫ్ పార్టనర్’ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

కమర్షియల్ సినిమాలకి దూరం:

కమర్షియల్ సినిమాలు చేయడం మానేశాను. ఇప్పుడు కేవలం ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్లే సినిమాల్లోనే నటిస్తాను. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో నటిస్తే ప్రజల్లో చెరగని ముద్ర వేసుకుంటాం. ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు, చైన్ స్నాచింగులు జరుగుతున్నాయి. వీటిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతోంది. పత్రికల్లో ఇలాంటి వార్తలు చదివినప్పుడల్లా నా హృదయం ద్రవిస్తుంది.

“సౌందర్య”నాకు క్లోజ్ ఫ్రెండ్ :

తెలుగు సినీనటి సౌందర్య అంటే నాకు ఎనలేని ఇష్టం. ఆమె ఆకస్మికంగా చనిపోవడం నన్ను చాలా బాధకు గురిచేసింది. సౌందర్య నాకు మంచి స్నేహితురాలు. అలాగే దివంగత ఎన్‌టీఆర్, ఏఎన్‌ఆర్‌లు అంటే కూడా ఇష్టం. గతంలో వీరి సినిమాలు బాగా చూసే దాన్ని. వారి నటనకు హ్యాట్సాప్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts