లార్గన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నాగశౌర్య నూతన చిత్రం

0
nagsowrya
కెరీర్‌ ప్రారంభం నుంచి లవ్‌స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న నాగశౌర్య ఇప్పుడు కథా బలమున్న సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నూతన నిర్మాత రామ అక్కల ఓ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. లార్గన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రూపొందనున్న చిత్రమిది.  పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేసిన సాయి చైతన్య ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెలాఖరులో లాంచనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌ ప్రారంభిస్తారు.
రామ అక్కల పదేళ్లుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో పంపిణీదారులుగా వ్యవహరిస్తున్నారు. అంతే కాదు అక్కడ మల్టీప్లెక్స్‌ థియేటర్‌లను కూడా నిర్మిస్తున్నారు. న్యూజీలాండ్‌, ఆస్ట్రేలియా దేశాల్లో విడుదలయ్యే భారీ బడ్జెట్‌ చిత్రాలన్నీ రామ రిలీజ్‌ చేసినవే. సినిమాపై వారికున్న ప్రేమతో కథాబలమున్న చిత్రాలను నిర్మించి ప్రేక్షకుల మన్ననలు పొందాలనే కాంక్షతో నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నారు. నాగశౌర్య హీరోగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెలాఖరులో సినిమా ప్రారంభించి మార్చిలో రెగ్యూలర్‌ షూటింగ్‌కి వెళ్తారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts