రౌడీరాథోడ్ సీక్వెల్

0

Akshayఅక్షయ్‌కుమార్ కథానాయకుడిగా నటించిన రౌడీరాథోడ్ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్రం విక్రమార్కుడుకు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రభుదేవా దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ నిర్మించారు. 2012లో విడుదలైన ఈ చిత్రం వందకోట్లకుపైగా కలెక్షన్లతో ఆనాటి లెక్కల ప్రకారం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టించింది. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత సంజయ్‌లీలాభన్సాలీ. సీక్వెల్‌కు కూడా ప్రభుదేవా దర్శకత్వం వహించబోతున్నారు. అయితే తొలిభాగంలో కథానాయికగా నటించిన సోనాక్షిసిన్హా స్థానంలో మరో నూతన నాయికను తీసుకోబోతున్నట్లు తెలిసింది. వచ్చే ఏడాది జనవరిలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts