"రౌడీఫెలో"కి రోజులు దగ్గర పడ్డాయి

0

Nara-Rohit2దర్శకుడిగా మారిన గీత రచయిత కృష్ణ చైతన్య తొలిసారి దర్శకత్వం వహిస్తున్న “రౌడీఫెలో” చిత్రం తాలూకు షూటింగ్ ముగింపు దశకి చేరుకుంది అని తెలుస్తోంది. యంగ్ హీరో నారా రోహిత్, విశాక సింగ్ జంటగా నటిస్తున్న ‘రౌడీ ఫెలో’ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 8న హైదరాబాద్ లో ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13 వరకు షూటింగ్ కొనసాగుతుంది. హీరో హీరోయిన్లపై రెండు పాటలను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్ తో సినిమా చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. టాకీ పార్ట్ షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ‘రౌడీ ఫెలో’ యూనిట్ ఇటివలే అమెరికా(వాష్టింగ్టన్)లో ఒక పాటను షూట్ చేశారు.

కృష్ణ చైతన్య దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ పాట రీమిక్స్ చేశారు. ‘భలే తమ్ముడు’లోని ‘ఎంతవారుగాని.. వేదాంతులైనాగాని.. వాలు చూపు తాకగానే’ పాటను ‘రౌడీ ఫెలో’ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. సన్నీ సంగీతం అందించారు. మూవీమిల్స్ పతాకంపై ప్రకాష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి వెంకటేశ్వరరావు, పోసాని కృష్ణ మురళి తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

నారా రోహిత్ ఇమేజ్ కి తగ్గట్టు కాస్త రగెడ్ టైటిల్ పెట్టిన కృష్ణ చైతన్య, పేరుకి తగ్గట్టు నారా రోహిత్ ని నిజంగానే రౌడీఫెలో ల చూపించడంలో సక్సెస్ అవుతాద లేదా అన్నది వేచి చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts