"రోబో-2" సన్నాహాల్లో శంకర్?

0

Director-Shankarఇప్పటికీ రెండేళ్లుగా కష్టపడుతూ నిన్న కాక మొన్న “ఐ” చిత్రాన్ని పూర్తిచేసిన శంకర్, తన తదుపరి చిత్రంగా “రోబో-2” ని అనుకుని, అందుకు తగ్గ సన్నాహాల్లో మునిగిపోయాడని ఇండస్ట్రీ టాక్ . సూపర్‌స్టార్ రజనీకాంత్ నాయకుడి (శాస్త్రవేత్త)గా, రోబో (ప్రతినాయకుడు)గా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఎందిరన్. సౌందర్యరాశి ఐశ్వర్యరాయ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శంకర్ హాలీవుడ్ చిత్రాలకు ఏ మాత్రం తగ్గని విధంగా చిత్రీకరించారు.

చిత్రం ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి రెండవ భాగాన్ని తెరపై ఆవిష్కరించడానికి శంకర్ సిద్ధమైనట్లు సమాచారం. ఆయన దీనికి కథను కూడా సిద్ధం చేశారట. ఇప్పటికే ఈ చిత్రంలో నటించడానికి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శంకర్ ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం ఎంపికలో నిమగ్నమయ్యారని సమాచారం. రజనీకాంత్‌కు తాను నటిస్తున్న లింగా చిత్రం షూటింగ్ తుది దశకు చేరుకోవడంతో ఎందిరన్ – 2 కోసం తనను తాను రెడీ చేసుకుంటున్నారట.

శంకర్ వచ్చే సంవత్సరం ఈ సినిమాని మొదలుపెట్టినా, తక్కువలో తక్కువ ఒక యేడాదిన్నర ఏసుకోండి చిత్రీకరణకి…. ఈ మధ్య కాలంలో తరచూ అనారోగ్యానికి గురవుతున్న రజనీ ఆరోగ్యం అప్పటిదాకా సహకరిస్తుందా… అరవైకి పైబడిన వయసులో రజనీ మళ్లీ అంత కష్టపడి ఆ సినిమాని పూర్తి చేయగలడా అనండి వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts