రోజా …. ఇదేం కొత్త బాజా?

0

Roja Karthika photosఅడుగు పెట్టిన చోటల్లా, ఏదో ఒక అపప్రదని మూతగట్టుకుని ప్రస్తుతం అవైకాపాలో ఎమ్మెల్యే గా కొనసాగుతున్న రోజాని, రోజా మాటలని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఎల్లప్పుడూ పదిమంది అటెన్షన్ కి అలవాటుపడ్డ ప్రాణం కనుక, ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో నిలిచే పనుల్లోనే రోజా ఉంటుంది అని అందరూ అనే మాటే. గత కొన్నాళ్లుగా చడీ చప్పుడు లేకుండా ఉన్న రోజా, రెండు రోజుల క్రితం బాలకృష్ణ మీద నోరు పారేసుకోవడం మనం చూశా. ఇప్పుడు తాజాగా, విచిత్రంగా పవన్ కల్యాణ్ ని ఆకాశానికి ఎత్తెస్తోంది. అసలేం జరుగుతోంది? అని అభిమానులంతా ఆశ్చర్యపోతున్నారు.

తెలుగుదేశ ప్రభుత్వాన్ని తన విమర్శలతో టార్గెట్ చేస్తూ అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ తప్పుడు హామీలిచ్చి, ప్రజలను మభ్యపెట్టిందని అంటూ తెలుగుదేశ నాయకుల సత్తా పై నమ్మకం లేక పవన్‌కల్యాణ్ కాళ్లు పట్టుకుని మద్దతు కోరారని సంచలన వ్యాఖ్యలు రోజా చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రస్తుతం టీడీపీ అధికారంలో ఉన్నా ఆ పార్టీ నేతలంతా పవన్ ఫోటో పెట్టుకుని పూజలు చేయాలని కామెంట్లు రోజా విసిరినట్లు టాక్. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని స్థితిలో ఉన్న తెలుగుదేశ పార్టీ నిజస్వరూపాన్ని త్వరలోనే ప్రజలు గుర్తిస్తారని అభిప్రాయ పడుతోంది రోజా. రెండు రోజుల క్రితం బాలయ్య పై సెటైర్లు నేడు పవన్ పై పొగడ్తలు కురిపిస్తున్న రోజా అసలు ఉద్దేశ్యాలు ఏమిటో రానున్న రోజులలో బయటకు వచ్చే అవకాశం ఉంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts