రెడీ ఫర్ రిలీజ్: \’లండన్ లైఫ్\’

0

74d64b37-49c4-4b78-ac38-f69af43a3840 copy

8846c96e-0af8-4d45-adc8-23d1f0350565 copy

a67a4559-f0b8-4391-b688-0f4dab129c52 copy

a79aae92-70e8-43c0-8750-822a7ee05ddd copy

bb4400ac-3a7e-4c32-9de4-890477e868d0 copy

e3b2ea3e-dd47-44a8-8bcf-218f6b78f7f0 copy

f876d2bd-e261-4443-a98c-1f32e3d55f9e copy

f790491d-caea-45d7-a704-deb9b2474060 copy

అసద్ షాన్, యాంబర్ రోజ్ ప్రధాన పాత్రల్లో నవీన్ మేడారం దర్శకత్వంలో రూపొందించిన సినిమా \’లండన్ లైఫ్\’. లండన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫిబ్రవరి 12న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా..
దర్శకుడు నవీన్ మేడారం మాట్లాడుతూ.. \’\’హాలీవుడ్ లో సుమారుగా ముప్పై సినిమాలకు పని చేశాను. ఆ అనుభవంతో ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాను. ఇండియా నుండి లండన్ వెళ్ళిన తొమ్మిది మంది అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే ఇంట్లో ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో వాళ్ళకు ఎదురైన సంఘటనలను సినిమాగా రూపొందించాం. పూర్తిగా లండన్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ఈ కథ మొత్తం ఇంగ్లీష్ లోనే ఉంటుంది. అభిషేక్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 12న హైదరాబాద్ లో రిలీజ్ చేస్తున్నాం. లండన్, అమెరికాలలో కె.వి పిక్చర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఐ.టి ఉద్యోగులు, ఫారెన్ లో చదువుకునే స్టూడెంట్స్ ను టార్గెట్ చేసి ఈ సినిమా చేశాం. సిద్ధార్థ్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. మంచి రొమాంటిక్ కామెడీ ఫిలిం ఇది\’\’ అని చెప్పారు.
కాళి సుదీర్ మాట్లాడుతూ.. \’\’టాలెంట్ ఉండి మంచి దారి తెలియక చాలా మంది ఉన్నారు. చిన్న సినిమాలను ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి అంగీకరించాం. నవీన్ మేకింగ్ చాలా బావుంది. సినిమాలో మంచి ఎమోషనల్ లవ్ స్టొరీ ఉంది\’\’ అని చెప్పారు.
రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. \’\’నవీన్ నాకు మంచి స్నేహితుడు. తను డైరెక్ట్ చేసిన లండన్ లైఫ్ సినిమా చూశాను. ఇదొక ఎమోషనల్ డ్రామా. హైదరాబాద్ లోని 33 మల్టిప్లెక్స్ థియేటర్లలో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలతో పాటు ఓవర్సీస్ లో కూడా సినిమా రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 12న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి\’\’ అని చెప్పారు.
సిద్ధార్థ్ మాట్లాడుతూ.. \’\’ఈ సినిమా కథ తెలిసినప్పుడు కథకు నేను బాగా కనెక్ట్ అయ్యాను. సాంగ్స్, సినిమా బాగా వచ్చింది\’\’ అని చెప్పారు
ఈ చిత్రానికి దర్శకుడు: నవీన్ మేడారం, ప్రొడ్యూసర్: రేణు పటేల్, ఫోటోగ్రఫీ: ఆంతోనీ గుర్నెర్, ఎడిటర్: రోబర్టో ప్రెస్టియా, మ్యూజిక్: సిద్ధార్థ్ సదాశివుని, స్క్రీన్ ప్లే: భైరవి పటేల్, నేవీన్ మేడారం, డిస్ట్రి బ్యూటర్: అభిషేక్ పిక్చర్స్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts