రెట్రో లుక్ తో తమన్నా

0

tamannahఈ క్రింద ఫొటోలో తమన్నా ని చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. పూర్తి స్ధాయి రెట్రో లుక్ తో ఆమె తన అభిమానులను ఆనందపరచటానికి సిద్దపడుతోంది. తమిళంలో తమన్నా ప్రస్తుతం చేస్తున్న ‘Vasuvum Sivavum Onna Padichittanga’ లోది ఈ స్టిల్. బాస్ ఎనగర భాస్కరన్(తెలుగులో నేనే అంబాని) దర్శకుడు రాజేష్ డైరక్ట్ చేస్తున్న చిత్రంలో ఆమె ఇలా కొన్ని కొన్ని సన్నివేశాల్లో కనిపించనుంది. ఈ సన్నివేశాలు ఫన్నీగా ఉండనున్నాయని తెలుస్తోంది. ఈ ఫొటోలో తమన్నా ని చూస్తుంటే మన పాత చిత్రాల్లోని హీరోయిన్స్ గుర్తు వస్తున్నారు కదూ.

పరాజయంతో కెరీర్‌ను ప్రారంభించినా, తొందర్లోనే తన తప్పుల్ని సరిదిద్దుకొనే స్టార్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయింది తమన్నా. తెలుగునాట స్టార్‌ హీరోలతో జతకట్టింది. తమిళ, హిందీసీమల్ని చుట్టొచ్చింది. ఇప్పుడు మరో రౌండ్ వేస్తోంది. తాజాగా ఆమె రవితేజ సరసన నటించనుందని సమాచారం. రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకుడుగా రూపొందే చిత్రంలో ఆమెను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రచ్చ లోనూ తమన్నానే హీరోయిన్ గా చేసిన సంగతి తెలిసిందే. ఇక రవితేజ కిక్ 2 పూర్తైన వెంటనే ఈ చిత్రం షూటింగ్ కి వస్తారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts