రూటు మారింది!

0

Sunny-Leone-launches-SplitsVilla-season-7-photos (12)బాలీవుడ్ శంగార తార సన్నీలియోన్ సినిమా అనగానే బికినీలు, లిప్‌లాక్ సన్నివేశాలు మొదలుకొని అందాల ఆరబోతకు సంబంధించిన అనేక ఊహలు అభిమానుల మదిలో మెదలుతాయి. అందుకు తగినట్లుగానే జిస్మ్-2 రాగిణి ఎం.ఎం.ఎస్-2 వంటి చిత్రాల్లో అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని అలరించిందీ సుందరి. కెరీర్ ప్రారంభం నుంచి గ్లామర్ డాల్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ భామ కథానాయికగానే కాకుండా ఐటెంసాంగ్స్‌తోనూ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న విషయం తెలిసిందే. కొంతకాలంగా బాలీవుడ్‌తో పాటు దక్షిణాది చిత్రాలపై దష్టిపెడుతోన్న ఆమె ప్రస్తుతం తన పంథాను మార్చుకొనే పనిలో పడింది.

గ్లామర్ పాత్రలతో పాటు అభినయ ప్రధాన పాత్రల్లోనూ మెప్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఆ కోవలోనే ఆమె ఓ బాలీవుడ్ చిత్రంలో డీ గ్లామర్ పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే రామ్‌కుమార్ కథానాయకుడిగా దేవాంగ్ దోలాకియా దర్శకత్వంలో పటేల్ ర్యాప్ పేరుతో విభిన్న ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోంది. ఓ మధ్య వయస్కుడైన గుజరాతీ వివాహితుడికి, సినిమా కథానాయికకు మధ్య జరిగే ప్రేమాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో సన్నీలియోన్ అభినయానికి ఆస్కారమున్న పాత్రలో నటిస్తున్నట్లు తెలిసింది. గ్లామర్‌కు దూరంగా సినిమా ఆసాంతం ఆమె నిండైనా వస్త్రధారణతో కనిపించనుందని తెలియవచ్చింది. అంతేకాకుండా ఈ చిత్రంలో బికినీ, లిప్‌లాక్ లాంటి సన్నివేశాలకు అస్సలు చోటు వుండదని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మార్లిన్ మన్రో, జాక్ లీమన్‌ల ప్రణయగాథ తరహాలో సాగే ఈ చిత్రం సన్నీలియోన్ కెరీర్‌లో మొదటి క్లీన్ యు చిత్రంగా నిలుస్తుందని వారు చెబుతున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts