"రుద్రమదేవి" నగల కేసు దర్యాప్తు ముమ్మరం

0

Rudhramadeviదర్శకుడు గుణశేఖర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎన్ని వ్యయప్రయాసలకి ఓర్చి గత ఏడాది కాలంగా తెరకెక్కిస్తున్న భారీ భిత్రం’రాణి రుద్రమదేవి’. ఈ సినిమా షూటింగులో ఇటీవలే , టైటిల్ పాత్ర పోషిస్తోన్న అందాల భామ అనుష్క వేసుకునే నగలు చోరీకి గురయిన సంగతి విదితమే. పోలీసులు ఈ కేసుకీ సంబంధించిన దర్యాప్తుని మరింత ముమ్మరం చేశారని తెలుస్తోంది. దాదాపు కిలోన్నర తూగే నగలు మాయమయ్యాయని ఆ చిత్ర ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాంగోపాల్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే నగలు అద్దెకు ఇచ్చిన చెన్నైకి చెందిన నాదెళ్ల ఆంజనేయశెట్టి కంపెనీ ప్రతినిధి రవి సుబ్రహ్మణ్యంతో పాటు మరొకరిని విచారిస్తున్నారు.

శనివారం షూటింగ్ కు హాజరైన యూనిట్ సభ్యులతో పాటు ఇతరులను విచారిస్తున్నట్లు సీఐ రమేశ్ తెలిపారు. రుద్రమదేవిగా నటిస్తున్న అనుష్క రెండు మూడు రోజులుగా ఈ నగలు ధరించి షూటింగ్ లో పాల్గొన్నారు. పోలీసులు నగల వీడియో క్లిప్పింగ్స్ ను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

గిల్టు నగలు కాబట్టి సరిపోయింది కానీ, నిజం బంగారం అయ్యుంటే ఇంకెలా ఉండేదో పరిస్థితి?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts