రీల్ లైఫ్‌లో నెరవేరింది!

0

kritisanonవన్ చిత్రం ద్వారా కథానాయికగా అరంగేట్రం చేసింది ఢిల్లీ భామ కృతిసనన్. తొలి చిత్రంతోనే మహేష్‌బాబు లాంటి అగ్రకథానాయకుడి సరసన నటించే అదృష్టాన్ని దక్కించుకుంది. ఈ సినిమాతో తెలుగుప్రేక్షకుల్ని మెప్పించిన ఆమె ఇటీవలే హీరోఫంటి చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. పరుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా హిందీలో తొలి విజయాన్ని అందుకున్న ఈ సుందరికి తెలుగు, హిందీ భాషల్లో చక్కటి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్ సరసన సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ప్రభుదేవా దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానుగుణంగా ఆమె డ్యాన్సర్‌గా కనిపించనుంది. ఈ పాత్రకోసం ఆమె కొద్దిరోజులుగా సల్సా లాంటి విదేశీ నృత్యాలతో పాటు కూచిపూడి, కథక్ వంటి భారతీయ సంప్రదాయ నృత్యాల్ని నేర్చుకొనే పనిలో వుంది.

ఆమె మాట్లాడుతూ చిన్నతనం నుంచి డ్యాన్సర్‌గా రాణించాలనేది నా కల. స్కూల్‌రోజుల్లో నృత్య పోటీల్లో అనేకసార్లు బహుమతుల్ని గెలుచుకున్నాను. కానీ నా తల్లిదండ్రులు నన్ను ఇంజనీర్‌గా చూడాలని సంకల్పించడంతో నృత్యకారిణిగా రాణించాలనే కోరిక అలాగే వుండిపోయింది. నిజజీవితంలో నెరవేరకుండా పోయిన ఆ కోరిక సింగ్ ఈజ్ బ్లింగ్ చిత్రంతో రీల్ లైఫ్‌లో సాకారం కావడం ఆనందంగా వుంది అని తెలిపింది. ప్రస్తుతం తెలుగులో సుధీర్‌వర్మ దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తోంది కృతిసనన్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ద్వితీయ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ప్ర‌తిష్టించి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా 02-04-2018 నుంచి 05-04-2018 వ‌ర‌కూద్వితీయ వార్ష...
powered by RelatedPosts