రారా కృష్ణయ్య మెప్పిస్తోంది..!

0

Ra Ra Krishnayya Success Meet (13)సోలో నువ్వానేనా చిత్రాల తర్వాత మా బ్యానర్‌లో వచ్చిన మూడో చిత్రం రారా కృష్ణయ్య కమర్షియల్‌గా నాకు చాలా సంతృప్తినిచ్చింది. మా అంచనాలకు తగ్గట్లుగా చక్కటి కలెక్షన్స్‌ను రాబడుతోంది. భారీ ఓపెనింగ్స్‌తో మొదటి మూడు రోజుల్లోనే మేము పెట్టిన బడ్జెట్‌ను తిరిగి సంపాదించిపెట్టింది. భవిష్యత్‌లో మరిన్ని మంచి సినిమాలు తీయగలిగే ధైర్యాన్ని అందించిన సినిమాగా నిలిచింది అని అన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్. ఆయన నిర్మాతగా ఎస్.వి.కె సినిమా పతాకంపై సందీప్‌కిషన్, రెజీనా నాయకానాయికలుగా నటించిన చిత్రం రారా.. కృష్ణయ్య.

మహేష్‌బాబు.పి దర్శకుడిగా పరిచయమయ్యారు. జగపతిబాబు కీలక పాత్రలో నటించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్రబందం గురువారం హైదరాబాద్‌లో విజయోత్సవ వేడుకను నిర్వహించింది. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ నా టైం బాగుంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో నేను నటించిన సినిమాలన్ని విజయం సాధిస్తున్నాయి. లెజెండ్ చిత్రం తర్వాత వైవిధ్యం కోసం నేను చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. దర్శకుడు నా నుంచి చక్కటి నటను రాబట్టుకున్నాడు. సందీప్‌కిషన్, రెజీనాల జోడి బాగుంది అని చెప్పారు. సందీప్ కిషన్ మాట్లాడుతూ నా కెరీర్‌లో మొదటి రెగ్యులర్ కమర్షియల్ చిత్రమిది. సాధారణ కథను దర్శకుడు వెండితెరపై అందంగా తీర్చిదిద్దారు.

జగపతిబాబు మా సినిమాలో భాగం కావడంతో విజయంపై నమ్మకం పెరిగింది. ప్రేక్షకుల నుంచి డిస్ట్రిబ్యూటర్ల వరకూ అందరూ సినిమా బాగుందని అంటున్నారు అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ సందీప్‌కిషన్, రెజీనా కాంబినేషన్‌కు ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తుంది. షారూఖ్‌ఖాన్, కాజోల్ జోడీలాగా అద్భుతంగా కుదిరిందని అంటున్నారు. జగపతిబాబు పాత్ర మాస్ ప్రేక్షకుల్ని అలరిస్తోంది. మొదటి సినిమాతోనే చక్కటి విజయాన్ని అందుకోవడం ఆనందంగా వుంది అని పేర్కొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts