రామ్-అనుపమా పరమేశ్వరన్-లావణ్యా త్రిపాఠి కి ‘ఉన్నది ఒకటే జిందగీ’ 

0

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్ ను సరికొత్తగా ఆవిష్కరించిన చిత్రం ‘నేను శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ హిట్ కాంబినేషన్ లో మరో సినిమా నిర్మాణంలో ఉంది. ‘స్రవంతి’ రవికిశోర్,
పి.ఆర్‌. సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్ పతాకంపై ఈ చిత్రాన్ని కష్ణచైతన్య నిర్మిస్తున్నారు. ఇందులో అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి కథానాయికలు. ఈ చిత్రానికి ‘ఉన్నది ఒకటే జిందగీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇప్పటివరకూ జరిపిన షెడ్యూల్స్ లో 50 శాతం పైగా సినిమా పూర్తయింది. ఈ నెల 7న ఊటీలో షెడ్యూల్ ప్రారంభించనున్నారు.

ఈ సందర్భంగా `స్రవంతి` రవికిశోర్ మాట్లాడుతూ – “స్నేహం, ప్రేమ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఈ నెల 6న ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా ఈ చిత్రంలో ఉన్న ‘ట్రెండ్ మారినా.. ఫ్రెండ్ మారడు…’ అనే పాటకు సంబంధించిన ‘లిరికల్ వీడియో’ను విడుదల చేయబోతున్నాం. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ పాటను చంద్రబోస్ రాశారు. దేవిశ్రీ ప్రసాద్ అన్ని పాటలకూ మంచి ట్యూన్స్ ఇచ్చారు. ఊటీలో జరపనున్న భారీ షెడ్యూల్ తో ఒక పాట మినహా సినిమా పూర్తవుతుంది. ఆ పాటను వచ్చే నెల ఇటలీలో చిత్రీకరిస్తాం. దసరాకి సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం” అని చెప్పారు.

శ్రీవిష్ణు, ‘పెళ్లి చూపులు’ ఫేమ్‌ ప్రియదర్శి ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాశ్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌ రెడ్డి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts