రామయ్య పోరాటం

0

Rajyadhikaram-Movie-అనాదిగా సమాజంలో దళితులు వివక్షకు గురవుతూనే ఉన్నారు. కారంచేడు, చుండూరు, వేంపేట, లక్ష్మీపేట.. ఇలాంటి ఘటనలో దళితుల వూచకోతకు నేలతల్లి తల్లడిల్లుతోంది. ఇలాగే అగ్రవర్ణాల చేతుల్లో నానా ఇబ్బందులు పడ్డ రామయ్య అనే రైతు జరిపిన పోరాటమే మా సినిమా అంటున్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం ‘రాజ్యాధి కారం’. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడారు. ”నా నుంచి వస్తోన్న 27వ సినిమా ఇది. సమాజంలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలకు మా సినిమా వేదికగా నిలుస్తుంది. బాధితుల పోరాటాల తర్వాత నిందితులకు శిక్షలు పడుతున్నా.. పై న్యాయస్థానాలకు వెళ్లి కేసులను మాఫీ చేయించుకుంటున్నారు. దీనికి రాజకీయ నేపథ్యం కొమ్ముకాస్తోంది. దీన్ని ఎదిరించే ఓ వ్యక్తి కథే ఈ సినిమా. అధికారం, రాబడి కలసి ప్రస్తుతం రాజకీయంగా వెలుగొందుతోంది. దీనిపై ప్రజలు ఆలోచించాలి.. విజయం సాధించాలి అనేది సినిమా సారాంశం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. ప్రజా కవులు అందించిన పాటలను ప్రజలు ఆదరిస్తున్నారు” అన్నారు.
విడిపోదాం.. సాధిద్ధాం: ”రాష్ట్రం రెండుగా విడిపోయింది. ఇక చిత్ర పరిశ్రమ కలసి ఉండటం ఎందుకు? అందుకే చలన చిత్ర వాణిజ్య మండలిని కూడా విడగొట్టేద్దాం. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం కొత్త ఛాంబర్‌లను ప్రారంభించి తెలుగు సినిమా అభివృద్ధికి దోహదపడదాం. సినిమా, ప్రభుత్వ పెద్దలు కలసి కూర్చొని ఈ విషయాన్ని సామరస్యంగా తేల్చుకోవాలి. ఒక రాష్ట్ర ఛాంబర్‌లో వేరే ప్రాంతం వారి పెత్తనం ఉండకూడదు అనేది నా అభిప్రాయమ”న్నారు ఆర్.నారాయణమూర్తి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Nela Ticket movie review
Nela Ticket Review: అమ్మ చేతి ముద్దపప్పు ఆవకాయ ఎంత బాగుంటుందో కదా. అమ్మ ప్రతి రొజూ అదే చేసినా ఆనందంగా తింటాం, ఎందుకు అంటే అది ముద్దపప్పు ఆవకాయ ...
‘ఆపరేషన్ 2019’ ట్రైలర్ లాంచ్
“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపా...
`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
powered by RelatedPosts