‘రాణి గారి బంగళా’ లోగో విడుదల

0

‘రాణి గారి బంగళా’ లోగో విడుదల
ఆనంద్ నందా, రేష్మి, శివకృష్ణ ప్రధాన పాత్రల్లో వి.సినీ స్టూడియో నిర్మాణంలో డి.దివాకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రాణి గారి బంగళా’. ఈ సినిమా లోగో లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ సందర్భంగా..
దర్శకుడు డి.దివాకర్ మాట్లాడుతూ.. ”ఈ సినిమా కోసం చాలా టైటిల్స్ అనుకున్నాం కాని ‘రాణి గారి బంగళా’ ను ఫైనల్ చేశాం. ఈ టైటిల్ సినిమాకు యాప్ట్ అవుతుందని భావించాం. 2015 డిశంబర్ లో ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లో జనవరి 25నాటికి పూర్తి చేసేశాం. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నిర్వహించి మార్చి చివరి వారంలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాం. ప్రేమకథా చిత్రమ్ ఫేం ప్రభాకర్ రెడ్డి గారి ఫోటోగ్రఫీ ఈ సినిమాకు హైలైట్ గా నిలుస్తుంది. ఈ సినిమాతో రేష్మి స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది. ఆనంద్ కి ఇది మొదటి సినిమా అయినా చక్కగా నటించాడు. ఈ సినిమాలో శివకృష్ణ గారు కాటికాపరి పాత్రలో నటించారు. సినిమాకు ఆ పాత్ర చాలా కీలకం” అని చెప్పారు.
నటుడు శివకృష్ణ మాట్లాడుతూ.. ”జయం సినిమా తరువాత అంత ప్రాముఖ్యత ఉన్న పాత్రలో ఈ సినిమాలో నటించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా లైన్ వినగానే ఈ అవకాశాన్ని ఎలా అయినా సద్వినియోగం చేసుకోవాలని నటించాను. అనుకున్న బడ్జెట్ లో అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేశారు” అని చెప్పారు.
కెమెరామన్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ”నా మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాననే నమ్మకం కలిగింది. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను” అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో బాలాజీ నాగలింగం, వైజాగ్ ప్రసాద్, ప్రసన్న కుమార్, సాగర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
ఈ చిత్రానికి కెమెరా: ప్రభాకర్ రెడ్డి, ఎడిటర్: అనిల్ మల్ నాడు, స్టొరీ: వి.లీనా, సమర్పణ: బాలాజీ నాగలింగం, కో ప్రొడ్యూసర్: శ్రీనివాసరావు, నిర్మాతలు: వి.సినీ స్టూడియో, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: డి.దివాకర్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
powered by RelatedPosts