రవితేజ ‘బెంగాల్ టైగర్’ అప్‌డేట్స్

0

Bengal tiger Movie Opening Photos (5)అధినేత’, ‘ఏమైంది ఈ వేళ’, ‘ప్యార్ మే పడిపోయానే’ చిత్రాల నిర్మాత కె.కె. రాధామోహన్ నిర్మిస్తున్న సినిమా ‘బెంగాల్ టైగర్’! మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘రచ్చ’ తీసిన సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘బలుపు’, ‘పవర్’ సినిమాలతో మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్న రవితేజ… ‘బెంగాల్ టైగర్’లో టైటిల్ రోల్ పోషిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన తాజా షెడ్యూల్ శుక్రవారం హైదరాబాద్ లో మొదలైంది. గత యేడాది వచ్చిన ‘పవర్’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆచితూచి అడుగేయడం మొదలెట్టాడు రవితేజ. అందుకే తనకు ‘కిక్’లాంటి సూపర్ హిట్ ఇచ్చిన సురేందర్ రెడ్డితోనే ‘కిక్ -2’ లో నటిస్తున్నాడు. ఆ సినిమా సమ్మర్ స్పెషల్ గా మే 7న విడుదల కాబోతోంది. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ‘బెంగాల్ టైగర్’నూ శరవేగంతో పూర్తి చేసి… వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 17న విడుదల చేయబోతున్నారు. శుక్రవారం మొదలైన సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్, చిలుకూరు, ఫిల్మ్ సిటీలో మే 6 వరకూ జరుగుతుంది. ఇందులో తొలిసారి రవితేజ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా, అందాల సుందరి రాశీఖన్నా నటిస్తున్నారు. అలానే ‘అత్తారింటికి దారేది’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రముఖ బాలీవుడ్ నటుడు బొమన్ ఇరానీ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts