"రభస" విడుదలవడమే గొప్ప: సమంత

0

Samantha-New-stillsఏంటి…షాక్ అయ్యారా? మీరు చదివింది నిజమే. ఈ కామెంట్స్ చేసింది ఎవరో కాదు, సాక్షాత్తూ సమంత తాజాగా ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇలా కామెంట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. అసలే అమ్మడి నోటివాటం తో ఈ మధ్య పలుసార్లు పత్రికా ముఖంగా అవాకులు చెవాకులు పేలి అభిమానుల ఆగ్రహానికి గురైన ఈ భామ, ఇపుడు “రభస” మీద చేసిన కామెంట్స్ ఎంతటి దుమారం లేపనున్నాయో చూడాలి. ఇక అసలు విషయానికి వద్దాం. సమంత ఏమన్నదో ఒకసారి చూద్దాం.

“సినిమా మొదలు పెట్టినప్పుడు ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది మరే సినిమా ఫెయిల్ అవుతుంది అన్న విషయం ఫై ఎవరికీ క్లారిటీ ఉండదు. సినిమా ప్రారంభం నుండి సమస్యలతో నడిచిన ‘రభస’ విడుదల కావడమే చాల గొప్పగా తాను భావిస్తున్నాను” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. అంతేకాదు , సినిమా జయాపజయాలలో హీరోయిన్ పాత్ర చాల పరిమితంగా ఉంటుంది అని చెపుతూ గతంలో తాను పవన్ మహేష్ లతో నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ కావడం వెనుక తన పాత్ర కంటే ఆ హీరోల ఇమేజ్ ఆ సినిమాలను ఆ స్థాయిలో సూపర్ హిట్ చేశాయని ఆ సూపర్ హిట్ సినిమాలలో కూడ తన పాత్ర పరిమితం అని తేల్చి చెప్పింది సమంత. అంతేకాదు ‘లక్కీ గర్ల్,’ ‘గోల్డెన్ గర్ల్’ అనే ట్యాగ్ ల పై తనకు నమ్మకం లేదని అటువంటి బిరుదులూ తనకు మీడియా ఎందుకు తగిలిస్తుందో అర్ధం కాదని కామెంట్ చేసింది సమంత.

అదేవిధంగా అదృష్టం అనేది ఎవరి దగ్గరా శాస్వితంగా ఉండదని ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి జీవితాంతం అదృష్టవంతుడిగా కొనసాగాలి అనుకోవడం అవివేకం అని చెపుతోంది సమంత. తెలుగు సినిమా షూటింగ్ ల కోసం తాను భాగ్యనగరానికి వచ్చినప్పడు తానెప్పుడు తన తల్లినీ లేదా తండ్రిని తోడుగా తెచ్చుకోలేదని అయినా తనకు ఎటువంటి సమస్యలు టాలీవుడ్ లో ఎదరు కాలేదని చెపుతూ మన ప్రవర్తన బట్టి ఎదుటి వారు మనకిచ్చే గౌరవం ఉంటుంది అని అభిప్రాయపడుతోంది సమంత. ట్విస్ట్ ఏమిటంటే పవన్, మహేష్ ల వల్ల తన గత సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి అని చెపుతున్న సమంత ‘రభస’ పరాజయం వెనుక తన పాత్ర కంటే జూనియర్ పాత్ర ఎక్కువ అని అర్ధం వచ్చేటట్లుగా ఈ మాయలేడి ఈ కామెంట్లు చేసింది అనుకోవాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫిబ్రవరి 25న 'కణం` తొలి సింగిల్‌
నాగశౌర్య, సాయిపల్లవి జంటగా ఎన్‌.వి.ఆర్‌. సినిమా సమర్పణలో లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై విజయ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'కణం'. 'ఛలో' తర్వాత నా...
`కాలా` టీజ‌ర్ డేట్ ఫిక్స్
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కాలా’ మూవీ టీజర్‌పై సస్పెన్స్ వీడింది. ఎప్పడు రిలీజ్ చేస్తారా..? అని ఎదురు చూసిన అభిమాలను ఆ చిత్ర యూనిట్ శుభవార్త తె...
మార్చి 9న విజయ్ మంత్రం వేస్తాడా?
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా అర్జున్ రెడ్డి చిత్రంతో వ...
powered by RelatedPosts