రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ సెలెబ్రేషన్స్

0

Run Raja Run stills5యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తన తొలి ప్రయత్నం మిర్చితో సూపర్ డూపర్ హిట్ ని సాధించిన నిర్మాతలు వి.వంశీ కృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి సంయుక్తంగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం.2గా నిర్మిస్తున్న చిత్రం రన్ రాజా రన్. శర్వానంద్ హీరోగా నటించిన ఈ చిత్రంలో సీరత్ కపూర్ హీరోయిన్ గా నటించింది. లవ్, కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఇటీవలే విడుదలై ఛార్ట్ బస్టర్స్ లో టాప్ గా నిలిచింది. కమలహాసన్ విశ్వరూపం 2 చిత్రానికి సంగీతాన్ని అందించిన జిబ్రాన్.యం రన్ రాజా చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ సందర్భంగా రన్ రాజా రన్ ఆడియో సక్సెస్ మీట్ ను గ్రాండ్ లెవల్లో చిత్ర నిర్మాతలు ప్లాన్ చేశారు. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న హాయ్ ల్యాండ్ లో దాదాపు 2000 మంది అభిమానులు సమక్షంలో ఈరోజు (14-07-14, సోమవారం) సాయంత్రం 5 గంటలకు ఆడియో సక్సెస్ సంబరాల్ని గ్రాండ్ గా చేయనున్నారు. సుజిత్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి ప్రభాస్ మిర్చికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మధి ఛాయాగ్రహణం అందించారు. ఈ సినిమాని జులై 18న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ధియేటర్లలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts