రచయితలకి మెగాస్టార్ బంపర్ ఆఫర్

0

chiru-150th-movie-imagesఇలాంటి అవకాశాలు మళ్లీ మళ్లీ రావు. అందుకే , వచిన్నపుడే ఒడిసిపట్టుకోవాలి మరి. టాలీవుడ్ లో ప్రస్తుతం కథా రచయితలందరూ అదే పనిలో ఉన్నారు అని వినికిడి. ఇంతకీ విషయం ఏమిటి అంటే, టాలీవుడ్‌ని మకుటంలేని మహారాజులా ఏలిన చిరంజీవి రాజకీయ రంగప్రవేశం చేసి బోల్తాపడ్డారు. ఆ సినీ సుప్రీం ఇప్పుడు మళ్లీ వెండితెరకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమయ్యారు. రాజకీయాల ద్వారా పోయిన ప్రజాదరణను, సినిమాల ద్వారా ప్రేక్షకాదరణ రూపంలో మళ్లీ పొందాలని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు వీలైనంత త్వరగా తన 150వ చిత్రం ప్రారంభించాలన్న ఉత్సాహంతో చిరంజీవి ఉన్నారు.

అత్యంత ప్రతాష్టాత్మకంగా, తన మెగా ఇమేజ్ కు తగ్గట్టుగా ఈ సినిమా ఉండాలని ఆశిస్తున్నారు. అయితే ముందుగా అందుకు తగ్గ కథ కావాలి. ఆ ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ఇప్పటికే చిరంజీవి పలు కథలు విన్నారు. రీమేక్ కోసం పలు ఇతర భాష చిత్రాలు కూడా చూశారు. ఇప్పటివరకు ఆయనకు ఏ కథా నచ్చలేదు. అందుకని కథా రచయితలకు చిరంజీవి ఒక బంపర్ ఆఫర్ ప్రకటించినట్లు సమాచారం. తన ఇమేజ్ కు, తన 150 చిత్రం స్థాయికి తగిన అద్భుతమైన కథ అందిస్తే కోటి రూపాయల పారితోషికం ఇప్పిస్తానని ప్రకటించారట.

చిరంజీవి 150వ సినిమాకు కథ అంటే మాటలుకాదు. ఆ చిత్రానికి కథ అందిస్తే ఎంతటి పేరు వస్తుందో అందరికీ తెలిసిందే. చిరుకు నచ్చే విధంగా, మెచ్చేవిధంగా కథను రాయడానికి రచయితలు పోటీపడుతున్నారు. కోటి రూపాయల బంపర్ ఆఫర్ ఎవరిని వరిస్తుందో! కావాలంటే, మీరూ ఒకసారి ప్రయత్నించి చూడండి… ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు, ఏ బుర్రలో ఏ కథ ఉందో మరి.. ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఫేమ‌స్ హాలీవుడ్ జంట.. విడాకుల బాట‌!
హాలీవుడ్‌లో మరో జంట పెళ్లి పెటాకులయ్యింది. రెండేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న జెనిఫర్ అనిస్టన్, జస్టిన్ థెరోక్స్ విడిపోయారు. 2015 ఆగస్టులో వారిద్దర...
టాలీవుడ్ లో ప్రియ ఫీవ‌ర్...రైట్స్ రెండు కోట్లు
ప్రియా ప్రకాశ్ వారియర్ అంటే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నం. 20 సెకన్లలో ఆమె పలికించిన హావభావాలు ఏ రేంజ్‌లో ఆకట్టుకున్నాయో తెలిసిందే. ఇంటర్నెట్‌లో అమ్మ‌డి...
నాగార్జున గురించి వ‌ర్మ ఎమ‌న్నాడంటే?
25 ఏళ్ల తర్వాత తనకో కొత్త హీరో దొరికాడని అంటున్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. ఇంతకీ ఎవరా హీరో అని ఆలోచిస్తున్నారా? ఎవరో కాదు..అక్కినేని నాగార్జ...
powered by RelatedPosts