"మేరీకోమ్"పై ఆంక్షల సడలింపు

0

Priyanka chopra

ఈ మధ్య కాలంలో క్రీడాకారుల జీవితాలపై వస్తున్న సినిమాలు ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంటున్నాయో మనం చూస్తున్నాం. మొన్నామధ్య వచ్చిన “భాగ్ మిల్కా భాగ్” అందుకు చక్కటి ఉదాహరణ. ఇకపోతే, ఈ మధ్యే అందాల సుందరి ప్రియాంక చోప్రా నటించిన ” ” గురించి కూడా మనకు తెలిసిందే. బాక్సర్ ” ” నిజజీవితం ఆధారంగా రూపొందించిన ఈ సినిమా కోసం ప్రియాంక ఎంతో కష్టపడింది. ఆ చిత్రం తాలూకు ప్రోమోలు ఇటీవలే విడుదలై విమర్శకుల ప్రశంసలను కూడా పొందాయి.

వచ్చే నెల ఐదున విడుదలయ్యే ఈచిత్రం కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మేరీకోమ్ సొంతగడ్డ మణిపూర్‌లో మాత్రం ఈ సినిమా విడుదలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఇక్కడ హిందీ సినిమాలు, ధారావాహికలపై నిషేధం ఉంది. ఈ చిత్రం విషయంలో నిబంధనలు సడలించే దిశగా ప్రభుత్వంతో మేరీకోమ్ జరిపిన చర్చలు ఆశాజనకమైన ఫలితాలనే ఇచ్చినట్లు తెలిసింది. ఇక్కడున్న మరో అడ్డంకి ఏంటంటే మేరీకోమ్ పాత్రలో ప్రియాంక నటించడం ఆ రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదట. ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారెవరైనా నటించాలని వారి కోరిక. మరి చివరకు మణిపూర్‌లో ‘మేరీకోమ్’ విడుదలవుతుందో లేదో వేచిచూద్దాం.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts