"మేరీకామ్" చూసి మేరీకామ్ ఏడ్చింది

0

Piyanka_Chopraఒక కళాకారుడు, లేదా ఒక క్రీడాకారుడి జీవితాలని తెరకెక్కించడం అంటే అంట సామాన్యమైన విషయం కాదు. ఎక్కడా, ఒరిజినల్ స్తోరీలోని ఫీల్ మిస్ కాకుండా తీయాలి. అలాగే సినిమా కనుక, కొన్ని కమర్షియల్ అంశాలని కూడా దృష్టిలో పెట్టుకోవాలి . అలా ఆ మధ్య వచ్చిన సినిమా “భాగ్ మిల్కా భాగ్” చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో మనం చూశాం . ఇప్పుడు దేశం గర్వించదగ్గ మహిళా బాక్సర్ “మేరీకామ్ ” జీవితం ఆధారంగా ప్రియాంక చోప్రా కథానాయికగా “మేరీకాం” అనే సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే . ఆ చిత్రానికి సంబంధించిన తాజా ట్రైలర్ నిన్న విడుదలయిన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా ప్రియాంక చోప్త్రాపై ప్రశంసల వర్షం కురుస్తోంది . ఈ సినిమా గురించి ప్రియాంక తాజాగా మీడియాతో మాట్లాడుతూ …

‘‘ఒక పాత్ర కోసం ఎలాంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధపడేవాళ్లే అసలు సిసలైన కళాకారులు. అందంగా మాత్రమే కాదు.. కథ డిమాండ్ చేస్తే అందవిహీనంగా కూడా కనిపించడానికి రెడీ అయిపోవాలి’’ అని ప్రియాంకా చోప్రా చెప్పింది . ఇప్పటివరకూ ఆమె చేసిన చిత్రాలు ఒక ఎత్తయితే.. ఇప్పుడు చేసిన ‘మేరీ కామ్’ మరో ఎత్తు అవుతుంది. బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం కోసం ప్రియాంక చాలా కష్టాలు పడింది . రోజుల తరబడి ఎండలో తిరిగి నల్లగా మారింది . బాక్సింగ్ నేర్చుకుంది .

ఈ చిత్రంలో నటించడంపట్ల తన ప్రియాంక అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ -‘‘క్లిష్టమైన పాత్రలు ఒప్పుకున్నప్పుడు నేను సవాలుగా తీసుకుంటా. ముఖ్యంగా మేరీ కామ్ లాంటి పాత్రలు ఓ ఛాలెంజ్. నా నిజజీవితానికీ, ఈ పాత్రకూ దగ్గర పోలికలుంటాయి. మాది చాలా చిన్న పట్టణం. అయినప్పటికీ అన్ని అడ్డు గోడలనూ ధైర్యంగా తొలగించుకుని, ఈ స్థాయికి చేరుకున్నాను. జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ అన్ని ఎల్లలు దాటినవారే’’ అనిచెప్పింది . ఈ చిత్రంలో ఓ సన్నివేశంలో ఆమె గుండులో కనిపిస్తుంది .

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts