"మేరీకామ్"కొత్త ట్రైలర్ పై ప్రశంసల వర్షం

0


పట్టుదల, కసి ఉంటే ఏదైనా సాధ్యమే అని బాలీవుడ్ అందాల భామ ప్రియాంకా చోప్రా నిరూపించింది. ఇప్పటి వరకు ప్రియాంక చోప్రాను మనం ఓ అందాల తారగానే చూశాం. కానీ ఆమెలో ఎంతటి గొప్ప నటి ఉందో తన తాజా చిత్రం “మేరీ కామ్” లో మనం చూడొచ్చు. అభినయానికి ఆస్కారంఉన్న పాత్రలు ఎప్పుడో కానీ దొరకవు. అలాంటి అవకాశాలు వస్తే ఎలా ఉపయోగించుకోవాలో “హైవే” చిత్రంతో ఆలియా భట్, “క్వీన్” చిత్రంతో కంగణా రనౌత్, “భాగ్ మిల్కా భాగ్” చిత్రంతో ఫర్హాన్ అక్తర్ ఇటీవలే నిరూపించారు. ఇప్పుడు ప్రియాంక వంతు. దేశం గర్వించదగ్గ మహిళా బాక్సర్, ఒలంపిక్ పతాక విజేత మేరీ కామ్ నిజ జీవితం ఆధారంగా రూపొందించబడుతున్న “మేరీ కామ్” చిత్రం.

తాజాగా విడుదలైన మేరికామ్ చిత్ర టీజర్ ప్రేక్షకులు, సినీ అభిమానులను రోమాలు నిక్కబొడిచే విధంగా ఉందని కితాబిచ్చారు. మేరికామ్ అభిమానుల జాబితాలో బాలీవుడ్ నటులు,టాలీవుడ్ నటులు చేరిపోయారు. మేరికామ్ టీజర్ చూసి బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ లు ట్విటర్ లో ఓ సందేశాన్ని ట్వీట్ చేశారు.

మేరికామ్ థియేటర్ ట్రైలర్ చూస్తుంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి. అద్బుతంగా నటించింది. పాత్ర కోసం ప్రియాంక చూపిన అంకితభావానికి తలవంచాల్సిందే. స్పూర్తిగా నిలిచింది అంటూ సందీప్ కిషన్ ట్వీట్ చేశారు.

రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తెరపై ప్రియాంక చోప్రా సీతాకోకచిలుకలో దూసుకుపోయింది అంటూ ఆయుష్మాన్ ఖురానా ట్వీట్ చేశారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

వినాయ‌క చ‌వితికి జై కానుక ఇదే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న చిత్రం ‘జై లవ కుశ’. ఇందులో తారక్‌ ‘జై’, ‘లవ’, ‘కుశ’ అనే మూడు పాత్రల్లో కనిపించనున్నారు. కాగా ...
ప్రియ‌మ‌ణి ఇంట్లో పెళ్ళి సంద‌డి
హీరోయిన్ ప్రియమణి వివాహం తన ప్రియుడు ముస్తఫారాజ్ తో ఈ నెల 25న వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రియమణి ఇంట్లో పెళ్లి సందడి నెల‌కోంది. మూడు రోజు...
స్పైడ‌ర్‌` ఓన్లీ రెండు భాష‌ల్లోనే?
స్పైడర్ తెలుగు వెర్షన్ విడుదలకు చకచకా సన్నాహాలు జరుగుతున్నాయి. అదే సమయంలో తమిళ వెర్షన్ కూడా విడుదలవుతుంది. అయితే ముందు అనుకున్నట్లు హిందీ వెర...
powered by RelatedPosts