ముస్లింల మీద నోరు పారేసుకున్న సల్మాన్

0

salmankhan-10facts-bigఅదేంటి….సొంత మతస్థుల మీదనే సల్మాన్ అలా ఎలా నోరు పారేసుకున్నాడు అని ఆశ్చర్యపోతున్నారా? అదంతే, సల్మాన్ సంగతి తెలియనిడి ఏముంది? అనుకున్నది అనేయడమే… నచ్చసింది చేసేయాడమే సల్మాన్ కి చిన్నప్పటినుంచీ అలవాటు. తాజాగా, ముస్లింల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసినందుకు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ పై మహారాష్ట్రలో కేసు నమోదైంది.

ఆల్ ఇండియన్ ఖ్వామీ తన్ జీమ్ విదర్భ యూనిట్ అధినేత మహ్మద్ అలీ చేసిన ఫిర్యాదు మేరకు సల్మాన్ మీద ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. సల్లూభాయ్ కావాలనే చేసిన వ్యాఖ్యల వల్ల, పనుల వల్ల మతపరమైన విద్వేషాలు చెలరేగే ప్రమాదం ఉందని, ఒక మతాన్ని, లేదా ఒక మతస్థుల నమ్మకాలను అవమానించేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని సదరు ఫిర్యాదులో పేర్కొన్నారు.

సల్మాన్ ఏర్పాటుచేసిన ‘బీయింగ్ హ్యూమన్’ అనే స్వచ్ఛంద సంస్థ ముంబైలో ఒక ఫ్యాషన్ షో నిర్వహించింది. ఆ షోలో ఒక మోడల్ ‘అల్లా’ అని అరబిక్ భాషలో తన డ్రస్సు మీద రాసుకుని ర్యాంపు మీద నడిచింది. సల్మాన్ ఖాన్ మీద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తులో ఉందని ఓ పోలీసు అధికారి తెలిపారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన వీడియో క్లిప్పింగులను కూడా అలీ పోలీసులకు సమర్పించారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts