ముద్దు గురించి ఆలోచిస్తా!

0

Isha Chawla Interview Stills (26)”తొలి నుంచి వినోద ప్రధానమైన చిత్రాల్లోనే నటిస్తున్నా. పక్కా వినోదాత్మక సినిమా ఎలా ఉంటుందన్నది మాత్రం ఇటీవలే అనుభవంలోకి వచ్చింది. తెరపై నవ్వులు కురిపించడం ఆషామాషీ కాదు. దానికి చాలా కసరత్తులు చేయాల్సి వుంటుంద”ని చెబుతోంది ఇషాచావ్లా. ‘ప్రేమకావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన కథానాయిక ఇషా. ‘పూలరంగడు’, ‘శ్రీమన్నారాయణ’, ‘మిస్టర్ పెళ్లికొడుకు’ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకొంది. ఇటీవల అల్లరి నరేష్‌తో కలిసి ‘జంప్ జిలాని’లో నటించింది. ఈ చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించింది ఇషా. ఆ విషయాలివీ…

”మామూలుగా తెరపై ఒక నరేష్ ఉంటేనే బోలెడంత అల్లరి ఉంటుంది. ఇక ఇద్దరు నరేష్‌లు కనిపిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూడొచ్చు. ఆయన ద్విపాత్రాభినయం చేసిన విధానం చాలా బాగా నచ్చింది. నాక్కూడా వైవిధ్యమైన పాత్ర దక్కింది. ఇందులో నా పాత్ర పేరు మాధవి. వృత్తి హెల్త్ ఇన్‌స్పెక్టర్. ఫ్యాక్షనిజం నేపథ్యం కూడా ఉంటుంది. ఎవ్వరినైనా సరే… భయపెట్టేస్తుంది. నన్ను చూసి ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ జంప్ అవుతుంటారు. అలాంటి పాత్రలో నన్ను నేను చూసుకోవడం గమ్మత్తుగా అనిపించింది. ఆడుతూ పాడుతూ సినిమా చేశాం. తొలి సన్నివేశం నుంచి చివరి వరకు ప్రేక్షకులు నవ్వుతూనే ఉంటారు. అందరికీ నచ్చే చిత్రమవుతుంది”.
చి ”తొలి నుంచి పక్కింటి అమ్మాయి తరహా పాత్రల్లోనే నటిస్తున్నా. అందుకు భిన్నంగా ఏదైనా చేయాలనుకొంటున్న దశలో ‘జంప్‌జిలానీ’ వచ్చింది. నిజానికి… ఒక నటిగా నేను ఎదురు చూస్తున్నది ఇలాంటి పాత్రల గురించే. సునీల్, నరేష్‌లాంటి కథానాయకులతో కలిసి నటించడం చాలా బాగుంది. ఎలాంటి కథలోనైనా ఇమిడిపోగలనన్న నమ్మకం కలిగింది. నేను నటించిన సినిమాలు వేగంగా విడుదల కాలేదు. అందుకే నా ప్రయాణం కాస్త నిదానంగా సాగుతున్నట్టు అనిపిస్తుంటుంది. సినిమా విషయంలో పెద్దగా ఆలోచించను. కథ నచ్చితే చాలు… చేసేస్తా”.

చి ”అందంగా కనిపించడాన్ని నేను ఇష్టపడతాను. చూసే ప్రేక్షకులకు, చేసే నాకు అసౌకర్యంగా అనిపిస్తే మాత్రం.. ఆ తరహా సన్నివేశాల జోలికి వెళ్లను. నా పరిధుల్లోనే తెరపై కనిపించాలనుకొంటా. ఇక ముద్దు సన్నివేశాల్లో నటించమని ఇప్పటిదాకా ఎవ్వరూ అడగలేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే ఆలోచిస్తా”.

చి ”డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీ లేవు. ప్రతినాయికగా నటించే అవకాశం వస్తే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ‘జంప్‌జిలాని’లో అందర్నీ భయపెట్టానని తెలిశాక నాకు ప్రతినాయిక పాత్రలపై మరింత మోజు పెరిగింది. ఆ అవకాశం ఎవరైనా ఇస్తారేమో చూడాలి. ప్రస్తుతానికి తెలుగులో సినిమాలేమీ లేవు. కన్నడలో రెండు సినిమాలు చేస్తున్నా. తెలుగు మాట్లాడటం వచ్చేసింది. రాబోయే చిత్రాల్లో డబ్బింగ్ చెప్పుకోవాలనుకొంటున్నా”.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts