"ముద్దుల" హీరోతో మరోసారి "మాయ"?

0

Maaya Movie Stills (11)విలక్షణ దర్శకుడు నీలకంఠ దర్శాక్తవం వహించిన తాజా చిత్రం “మాయ” గతవారం విడుదలయి స్థిరమైన కలెక్షన్లతో రెండవ వారంలోకి అడుగుపెట్టింది. విడుదలయిన మొదటి మూడు రోజులు “మాయ” పట్ల ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, ఆ తరువాత కలెక్షన్లు పుంజుకున్నాయి అని ఆ చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ మీడియాతో చెప్పారు.

నీలకంఠ మాట్లాడుతూ ” విభిన్న తరహాలో సాగే సినిమాలు చేయడం నాకు ఆసక్తి. అందుకే ఎప్పటికప్పుడు వినూత్న కథాంశాలు ఎన్నుకుంటాను. ఈ చిత్రం విడుదలైన రోజున కాస్త టెన్షన్ పడ్డాను. కానీ, ఆదివారం హౌస్‌ఫుల్ కావడంతో రిలీఫ్ అనిపించింది. సినిమా చూసినవాళ్లందరూ వినూత్న అనుభూతికి గురి చేసిందని, కథ కొత్తగా ఉందని అంటుంటే ఆనందంగా ఉంది’’ చెప్పారు.

మధుర శ్రీధర్ చెబుతూ – ‘‘కన్నడ నిర్మాత శ్రీధర్‌రెడ్డి ఈ చిత్రం రీమేక్ హక్కులు తీసుకున్నారు. ఒరియా, బెంగాలీ భాషల రీమేక్ హక్కులకు సంప్రతింపులు జరుగుతున్నాయి. హిందీలో ఇమ్రాన్ హష్మీతో రీమేక్ చేస్తే బాగుంటుందని ప్రయత్నాలు మొదలుపెట్టాం’’ అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 8th December 2017
[caption id="attachment_550514" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 8th December 2017[/caption]...
Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts