ముందుగా కోపం వస్తుంది.. తరువాత ఆలోచన వస్తుంది

0

RamGopalVarmaఒకప్పటి చరిత్ర ఆధారంగా జనాలు ఇంకా భరిస్తున్నదర్శకుడు ఎవరు అంటే ఎవరైనా టక్కున గుర్తొచ్చే పేరు రామ్‌గోపాల్ వర్మ. ఎప్పుడూ వివాదాల్లో మునిగి తేలడం.. అవి లేవంటే కొత్తగా వివాదాలు సృష్టించడం దర్శకుడు రాంగోపాల్ వర్మకు అలవాటే. అందులోనూ మహిళల మీద వ్యాఖ్యలు చేయమంటే ఆయన అందరికంటే ముందుంటారు కూడా. తాజాగా వర్మ మళ్లీ అదే తరహాలో తేనె తుట్టి ని కదిపాడు. ఓవైపు చేతిలో రెండు సినిమాలున్నా.. వాటి మధ్యలో ఖాళీ చూసుకుని మరీ ఈ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. యాపిల్ కంపెనీ ఫోన్లు, వాచీలు, కార్లు తయారుచేస్తోందని.. అంతా బాగానే ఉంది గానీ, మరి యాపిల్ మహిళలను కూడా తయారుచేస్తే చాలా బాగుంటుందని ఆశిస్తున్నట్లు ఆయన తన ట్వీట్లో చెప్పారు.

అలాగే.. అసలు లక్ష్మీదేవిని పూజించని అమెరికాలో మనకంటే ఎక్కువ డబ్బుందని మొదలుపెట్టారు. అది లక్ష్మీదేవి లోపమా.. లేక ఆమెను పూజించే మన మూర్ఖత్వమా అని ప్రశ్నించారు. అదేంటో కానీ, వర్మ వ్యాఖ్యలు చూడగానే ముందుగా కోపం వస్తుంది…కానీ తరువాత ఆలోచన వస్తుంది.. ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts