మీ హీరోని నేనేమీ వాడుకోవట్లేదు

0

Renu_Desai_turns_producer_2013_06_18_09_35_57ఇంత ఘాటుగా ఎవరు మాట్లాడి ఉంటారు అని ఆలోచిస్తున్నారా? కుర్ర వయసులోనే పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ లాంటి స్టార్ హీరోని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాక కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల విడిపోయిన రేణు దేశాయ్ ,పవన్ అభిమానులని ఉద్దేశించి ఇలా ఘాటుగా స్పందించింది. ఇంతకు ఏం జరిగింది?

అకిరా ఫిల్మ్స్ బ్యానర్ స్థాపించిన రేణు దేశాయ్ నిర్మాతగా మారి మరాఠీలో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తొలి ప్రయత్నంగా రేణు దేశాయ్ నిర్మించిన ‘మంగలాష్ తక్ వన్స్ మోర్’ సినిమా విజయం సాధించింది. ట్విట్టర్ లో రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న రేణు దేశాయ్….పవన్ పేరును వాడుకుని ఫేమస్ అవటానికి ప్రయత్నిస్తున్నానని వ్యాఖ్యలను ఖండించింది.

పవన్ కళ్యాణ్ ను పెళ్లాడక ముందు తాను ఫేమస్ మోడల్, నటి అనే విషయాన్ని రేణు దేశాయ్ గుర్తు చేసింది. ‘పవన్ గారు ఈజ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మీ’ అన్న ఆమె గత ఏడాది ఏ ఒక్కరి సాయం, మద్దతు లేకుండా ఓ హిట్ సినిమా తీశానని తెలిపింది. ఇకనైనా ఈ విషయంలో అతిగా ఆలోచించే బుర్రలు ఇకనైనా ఆపాలని సూచించింది. ఆ ఎనర్జీని ఏదైనా సోషల్ వర్క్ కు ఉపయోగిస్తే మంచిదని రేణు సలహా కూడా ఇచ్చింది.

గతంలో కూడా రేణుదేశాయ్ కి పవన్ అభిమానులు ఆమెను అవమానించే విధంగా మెసేజ్ లు పోస్ట్ చేశారు. ఆ మెసేజ్ లపై స్పందించిన ఆమె తన ఫేస్ బుక్ ద్వారా సమాధానం ఇచ్చింది. ‘ఇలాంటి మెసేజ్ లు పంపించడం సరికాదు. ఇది పవన్ కి కూడా నచ్చదు. నేను ఈ రోజు నుంచి నా ఇన్ బ్యాక్స్ ఆప్షన్ ని స్విచ్ఛాప్ చేస్తున్నాను. సెలబ్రెటీస్ కి కూడా పర్సనల్ లైఫ్ ఉంటుంది. వారిని ఈ విధంగా వేధించడం తగదు. పవన్ కళ్యాణ్ మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ, మిగతా వారి ఇబ్బందులను కూడా ఆలోచించాలి’ అని పేర్కొంది.

అదీ నిజమే కదా…. ఒకరి మీది అభిమానం , మరొకరి మీది ద్వేషంగా మారడం సరికాదు…ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
బగ్గిడి గోపాల్ సినిమా ఆడియో విడుదల
గ్గిడి ఆర్ట్స్ మూవీస్ పతాకంపై దర్శకుడు అర్జున్ కుమార్ రూపొందిస్తున్న చిత్రం బగ్గిడి గోపాల్. మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్ జీవిత కథతో ఈ సినిమా...
యూనివర్సల్ సబ్జెక్ట్ తో జూన్ 2 వస్తొన్న `డాక్టర్ సత్యమూర్తి`- నిర్మాత డి.వెంకటేష్
యశ్వంత్‌ మూవీస్‌ బ్యానర్‌పై తమిళంలో సూపర్ హిట్ అయిన 'ఒరుముకతరై' చిత్రాన్ని తెలుగులో 'డాక్టర్‌ సత్యమూర్తి' గా అనువదించి జూన్ 2 తెలుగులో విడుదల...
powered by RelatedPosts