మిస్సుకి పెట్టిన ముద్దు మిస్సయిందట

0

Oka Laila Kosam (6)ఏమీ అర్ధం కాలేదా? అదేదో బస్సో..రైలో మిస్ అయినట్టు….ముద్దు మిస్ అవడం ఏమిటా అని అనుకుంటున్నారా? అయితే ఇది మీరు పూర్తిగా చదవాల్సిందే.

బాలీవుడ్ లో ప్రతీ హీరో ముద్దు ముచ్చట్లు ఆడతారు కానీ, తెలుగులో ఇంకా చాలామంది హీరోలు అప్ గ్రేడ్ అవ్వాలి. కానీ, నాగ చైతన్య మాత్రం ఈ విషయంలో అందరికంటె కాస్త ముందే ఉంటాడు. తాను నటించే ప్రతీ చిత్రంలో కనీసం ఒక్క ముద్దు సీన్ అయినా ఉండేలా చూసుకుంటాడు.

ముఖ్యంగా “ఏ మాయ చేసావే” సినిమాలో సమంత – చైతు మధ్యన ముద్దు సీన్లు బాగా పేలాయి. అదే మ్యాజిక్ ఈ జంట ఇటీవలే “మనం” సినిమాలోనూ రిపీట్ చేసింది. అలాగే నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న “ఒక లైలా కోసం” చిత్రంలో కూడా హీరో నాగ చైతన్య- హీరోయిన్ పూజా హెగ్డే మధ్యన అలాంటి ఒక ఘాటైన ముద్దు సన్నివేశం ఉందని సమాచారం.

కాకపోతే,సెన్సార్ దగ్గరకి వెళ్ళేటప్పటికి సెన్సార్ వాళ్ళు మాత్రం సర్టిఫికేట్ ఇవ్వాలంటే, ఆ ముద్దు సన్నివేశాన్ని తీసేయాల్సిందే అని చెప్పారట. దాంతో చేసేదేమీ లేక, ఆ సన్నివేశాన్ని చిత్రం నుండి తొలగించారని తెలిసింది. “గుండె జారీ గల్లంతయిందె” చిత్రం తర్వాత విజయ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రూపొందించబడ్డ ఈ చిత్రం సెప్టెంబర్ ఆఖరులో విడుదల అవ్వొచ్చు అని తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts