మిల్కీబ్యూటీపై మండిపడుతున్న ముద్దుగుమ్మలు

0

sajid1కరవమంటే కప్పకి కోపం… విడవమంటే పాముకి కోపం అన్నట్టు ఉంది పాపం బాలీవుడ్ దర్శకుడు సాజిద్ ఖాన్ పరిస్థితి . ఎందుకు అంటారా? పాలబుగ్గల సుందరి తమన్నా బాలీవుడ్ లోతన ప్రియ నేస్తం సాజిద్ ఖాన్ దర్శకత్వంలో ‘హమ్‌షకల్స్’ అనే చిత్రంలో నటిస్తోంది అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో తమన్నాతో పాటు బాలీవుడ్ భామలు బిపాసా బసు, ఇషా గుప్తా కూడా నటిస్తున్నారు. అయితే దర్శక నిర్మాతలతో పాటు యూనిట్ సభ్యులు అంతా ఆ ఇద్దరు బాలీవుడ్ భామలకంటే తమన్నాకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పై బిపాసా మండి పడుతోంది. సీనియర్లను వదిలేసి జూనియర్లకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని ఏకంగా ఈ సినిమా నిర్మాతను ప్రశ్నించింది అని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

దీనికి తోడు ‘హమ్‌షకల్స్’ సినిమా ప్రమోషన్లకు కూడా తమన్నానే ఎంచుకోవడం బిపాసా కు మరింత తిక్క తెప్పిస్తోఓది అని టాక్. ఇటివల ఈ సినిమాకు సంభందించిన ఓ సీన్లో ఈ సినిమాలోని ముగ్గురు హీరోయిన్స్ బికేనీ వేయాల్సిఉందట. అయితే తమన్నా బికినీ వేయనని చెప్పడంతో ఆమెతో షార్ట్ వేయించి, మిగతా ఇద్దరినీ బికినీలో చూపించాడట దర్శకుడు. దీనితో కోపం పట్టలేక బిపాసా మీ ఇద్దరికీ ప్రేమ ఉంటే సెట్ బయట చూసుకోండి అంతే కానీ సీనియర్ హీరోయిన్స్ ను అవమాన పరచ వద్దు అంటూ ఈ సినిమా దర్శకుడు సాజిద్ ఖాన్ కు బిపాసా క్లాసు పీకింది అంటూ బాలీవుడ్ మీడియా కొక్కోరొక్కో అంటోంది.

అయినా బిప్స్ బేబీ, మూడు పదులనెప్పుడో దాటిన వయసుని కప్పేస్తూ అవకాశాల కోసం అర్రులు చాస్తున్న నీకు, పాతికేళ్ళ పాల బుగ్గల సుందరిపై అంత అసూయ దేనికమ్మా? ఊపు మీద ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఎందరు దర్శక నిర్మాతలని, హీరోలని నీ చుట్టూ తిప్పుకోలేదు? కోట్లకి కోట్లు వెనకేసుకొలెదు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts