మా వోడికి "భేల్ పూరీ "బాగా నచ్చింది

0

gowthamఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా సినిమా “ఆగడు” ఆడియో ఇటీవలే హైదరాబాదులో ఘనంగా జరిగింది. తనయుడు గౌతమ్ కృష్ణ తన పుట్టినరోజును తన తండ్రితో మొన్న ఆనందంగా జరుపుకున్నాడు. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే తప్పించి అను నిత్యం సందడి చేయని మహేష్ తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా తన ట్విటర్ లో పెట్టిన ట్విట్ అందర్నీ ఆశ్చర్య పరిచింది ‘నా కొడుకు
ఈ రోజుతో 8వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. మీ ప్రేమ, ఆశీర్వాదాలు చూపుతున్నందుకు ధాంక్స్. ‘ఆగడు’ సినిమాలోని ఆడియో ట్రాక్స్‌లో ‘భేల్‌పురి’ సాంగ్ గౌతమ్ ఫేవరెట్ అయిపోయింది. మళ్లీ మళ్లీ అదే పాట వింటూ చాలా ఎంజాయ్ చేస్తూ అదే పాటను కావాలి అంటున్నాడు. థమన్‌కు థాంక్స్’ అంటూ ట్వీట్ చేసాడు మహేష్.

గతవారం విడుదలైన ‘ఆగడు’ పాటలకు తన అభిమానులలోనే మిశ్రమ స్పందన రావడంతో ‘ఆగడు’ ఆడియోకు మరింత క్రేజ్ పెంచడానికి మహేష్ తన కొడుకు గౌతమ్ ను అడ్డు పెట్టుకుని ఈ కొత్త టెక్నిక్ ఉపయోగిస్తున్నాడు అనే వార్తలు కూడ ఉన్నాయి. మహేష్ కెరియర్ కు ఎంతో ముఖ్యంగా మారిన ‘ఆగడు’ సక్సస్ గురించి మహేష్ ఎంత టెన్షన్ పడుతున్నాడో ఈ ట్విట్ ద్వారా తెలుస్తోందని కొఓదరు విమర్శలు కూడ అప్పుడే మొదలు పెట్టేసారు. ప్రస్తుతం తమన్నా లక్ తన సినిమాల విషయంలో కలిసి రాకపోతున్న నేపధ్యంలో ‘ఆగడు’ పాటల డివైడ్ టాక్ తో పాటు తమన్నా భయం కూడ మహేష్ అభిమానులను విపరీతంగా భయ పెడుతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఒకే నెలలో విడుదల అవుతున్న అనేక భారీ సినిమాల మధ్య వస్తున్న ఆగడు మొదటి ఆట నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోతే మహేష్ ఆశలను ‘ఆగడు’ నెరవేర్చలేదు.

ఏ పాటలు ఎలా ఉన్నా, సినిమాలో సరకు లేనపుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? ఎందుకంటే, తాజాగా విడుదలయిన ఆగాడు ట్రైలర్ చూసి చాలామంది పెదవి విరిచారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts