మా మామగారితో మూడేళ్ళున్నా : కరీనా

0

Kareena-Kapoorపటౌడి కుటుంబంలో కోడలిగా కాలు పెట్టినప్పటి నుంచి, మంచి కోడలిగా పేరు తెచ్చుకుంది . ప్రస్తుతం చేతిలో ఏ సినిమాలూ లేక ఖాళీగా ఉన్న కరీనా భర్త సైఫ్ ఆలీఖాన్ తన తండ్రి మన్సూర్ ఆలీఖాన్ పటౌడి జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ సందర్భంగా, సైఫ్ సతీమణి కరీనా కపూర్ తన మామగారి గురించిన కొన్ని జ్ఞాపకాలని మీడియాతో ఇలా పంచుకుంది…

‘నేను మా మామగారితో మూడేళ్ళ పాటు ఉన్నా.. చాలా నెమ్మదస్తుడు.. తక్కువగా మాట్లాడేవారు.. సైఫ్ అన్నా, నేనన్నా చాలా ఇష్టపడేవారు..’ అని కరీనా చెప్పింది.

‘పటౌడీ గారు ఏనాడు నామీద అభిమానాన్ని ప్రత్యక్షంగా ప్రదర్శించలేదు. అయితే ఒకసారి నేను పటౌడీ(పట్టణం)లో ఉన్నప్పుడు నా భుజం మీద చెయ్యేసి మాట్లాడారు. అప్పుడు అర్థమైంది నాకు.. అతడి అభిమానం..’ అని చెప్పింది. ఆ అనుభవం నా జీవితాంతం గుర్తుంటుంది..’ అని ఆమె అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ‘నన్ను, సైఫ్‌ను చూసి మా మామగారు చాలా గర్వపడేవారు. ఆయన నేను చేసిన ‘ఓంకార’ సినిమా చూశారు. అందులో నా నటనను చూసి చాలా మెచ్చుకున్నారు..’ అని వివరించింది. ‘పటౌడ్ సాబ్ మంచి క్రీడాకారుడు.. అతడి జీవితం ఎందరికో స్ఫూర్తిని కలిగించింది. మరెందరికో ఆయన మార్గదర్శకుడయ్యాడు.. ఆయన నిర్యాణం తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలలో అతడిపై వచ్చిన ఆర్టికల్స్ చదివా.. అతడిని ఎన్నికోట్ల మంది అభిమానిస్తున్నారో తెలిసి ఆశ్చర్యపోయా.. అతడికి కోడలిగా వచ్చినందుకు చాలా గర్వపడుతున్నా..’

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts