మా టైటిల్ అందరికీ నచ్చింది

0

avika gor“ఉయ్యాల జంపాల” సినిమాతో “చిన్నారి పెళ్ళికూతురు” సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న అవికాగోర్ టాలీవుడ్ లో తెరంగేట్రం చేసింది. అందం ,అభినయం తో తన మొదటి సినిమాతోనే అవికా మంచి పేరు సంపాదించుకుంది. “ఉయ్యాల జంపాల” విడుదలయ్యాక దాదాపు ఇరవై సినిమా కథలు విన్నా కూడా, ఒక్కటి కూడా ఆమెకి నచ్చలేదట. కానీ, “లక్ష్మీ రావే మా ఇంటికి’ కథ బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేసింది.
వైజాగ్ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ కుటుంబ ప్రేమకథ చిత్రంలో నాగశౌర్య కథానాయకుడు. రచయిత నంద్యాల రవి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గిరిధర్ ప్రొడక్షన్స్ హౌస్ పతాకంపై మామిడిపల్లి గిరిధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇటీవలే పతాక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఊహలు గుసగుసలాడే’ తర్వాత నాగశౌర్య – అవికాగోర్‌ల మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. టైటిల్‌కి మంచి గుర్తింపు వచ్చింది’’ అని చెప్పారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఆగస్టు 6తో టాకీపార్ట్ పూర్తవుతుంది. అదే నెలాఖరు నుంచి వైజాగ్‌లో పాటల చిత్రీకరణ చేస్తాం. కేఎం రాధాకృష్ణన్ సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆనంద్, గోదావరి, చందమామ తరహాలో సంగీతం ఆహ్లాదకరకంగా ఉంటుంది’’ అని తెలిపారు. రావు రమేశ్, నరేశ్, వెన్నెల కిశోర్ తదితరులు ఇందులో ముఖ్యతారలు.

తన రెండవ సినిమాతో మరెంతమంది అభిమానులని సంపాదించుకుంటో ఈ చిన్నది వేచి చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts