మార్చి 18న వస్తున్న “మేము”

0

memu 1

సూపర్ స్టార్ సూర్య-అమలాపాల్-బిందుమాధవి నటించగా తమిళంలో ఘన విజయం సాధించిన “పసంగ-2” తెలుగులో “మేము” పేరుతో అనువాధమవుతుండడం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు పాండిరాజ్ రూపొందించిన ఈ చిత్రాన్ని “స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాతో కలిసి.. తన సొంత నిర్మాణ సంస్థ “2 డి ఎంటర్ టైన్మెంట్స్” పతాకంపై.. తెలుగులో హీరో సూర్య స్వయంగా సమర్పిస్తుండడం విశేషం. సాయి మణికంఠ క్రియేషన్స్ పతాకంపై జూలకంటి మధుసూదన్ రెడ్డి నిర్మిస్తున్న “మేము” చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… “సూపర్ స్టార్ సూర్య, స్టూడియో గ్రీన్ జ్ఞాన్ వేల్ రాజాల సంయుక్త సమర్పణలో “మేము” చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలతో కలిసి కచ్చితంగా చూసి తీరాల్సిన సినిమా “పసంగ 2” అని తమిళ మీడియాతో పాటు ఇంగ్లీష్ మీడియా సైతం తీర్మానించిన గొప్ప సినిమా ఇది. ఈ సినిమాకి వచ్చినన్ని మంచి రివ్యూలు, రేటింగ్స్ ఈ మధ్య కాలంలో మరే సినిమాకు రాలేదు. తమిళంలో ఈ చిత్రాన్ని సూర్య నిర్మించారు. వరుస విజయాలతో తమిళంలో సంచలన దర్శకుడిగా పేరొందిన పాండిరాజ్ “మేము” చిత్రంతో తన ప్రతిభాపాటవాలను మరోసారి అత్యంత ఘనంగా నిరూపించుకున్నారు. మార్చి18న ఈ చిత్రాన్ని అత్యధిక దియేటర్స్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. తెలుగులోనూ ఈ చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం మాకుంది” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: అర్రోల్ కొరెల్లి, చాయాగ్రహణం: బాలసుబ్రమణియన్ మాటలు-పాటలు: శశాంక్ వెన్నెలకంటి, సమర్పణ: “సూపర్ స్టార్” సూర్య-కె.ఇ. జ్ఞాన వేల్ రాజా, నిర్మాత: జూలకంటి మధుసూదన్ రెడ్డి, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: పాండిరాజ్!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ద్వితీయ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు
మ‌ర‌క‌త శ్రీ ల‌క్ష్మీ గ‌ణ‌ప‌తి దేవ‌స్థాన‌ము ప్ర‌తిష్టించి రెండు సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా 02-04-2018 నుంచి 05-04-2018 వ‌ర‌కూద్వితీయ వార్ష...
powered by RelatedPosts