మార్చి 11న విడుదలవుతున్న ‘ఓ స్త్రీ రేపు రా’

0

4మార్చి 11న విడుదలవుతున్న ‘ఓ స్త్రీ రేపు రా’
రీడింగ్‌ లాంప్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఆశిష్‌ గాంధీ, వంశీకష్ణ కొండూరి, కునాల్‌ కౌశిక్‌, దీక్షాపంత్‌, శృతి మోల్‌, మనాలి రాథోడ్‌ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘ఓ స్త్రీ రేపు రా’. ‘కల్పితమా..కచ్చితమా’ అనేది ఉపశీర్షిక. అశోక్‌ రెడ్డి దర్శక నిర్మాత. ఈ సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా… దర్శక నిర్మాత అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ”ఒకప్పుడు ఊళ్ళో దెయ్యం తిరుగుతుందని, ఇంటి గోడలపై ఓ స్త్రీ రేపు రా అని రాసుకునేవారు. కొన్నిచోట్లయితే భయంతో చాలా మంది వారు ఉంటున్న గ్రామాలను విడిచి పెట్టి వెళ్ళిపోయారు. ఈ హర్రర్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌ను సినిమాటిక్‌గా, డిఫరెంట్‌గా ఉండాలని కో ప్రొడ్యూసర్‌ ప్రవీణ్‌ సపోర్ట్‌తో ‘ఓ స్త్రీ రేపు రా’ చిత్రాన్ని రూపొందించాం. ‘కల్పితమా..కచ్చితమా’ ఉపశీర్షిక. టీమంతా చాలా ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. ఘంటశాల విశ్వనాథ్‌ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అలాగే ప్రమోషనల్‌ సాంగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. మ్యూజిక్‌తో పాటు సినిమాలో రీరికార్డింగ్‌ హైలైట్‌ కానుంది. అన్నీ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమాను మార్చి 11న విడుదల చేస్తున్నాం” అన్నారు.
వైవా హర్ష, స్వప్నిక, షాన్‌, వీరబాబు, శ్యాంసుందర్‌, సోనాల్‌ ఝాన్సీ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మ్యూజిక్‌: జి.వి, ఎడిటర్‌: రామాంజనేయ రెడ్డి, కెమెరా: సిద్ధం మనోహర్‌, దేవర హరినాథ్‌, సాహిత్యం: సుభాష్‌ నారాయణ్‌, పవన్‌ రాచేపల్లి, స్క్రిప్ట్‌, డైలాగ్స్‌: పవన్‌ రాచేపల్లి, కో ప్రొడ్యూసర్‌: ప్రవీణ్‌ సాగి, కథ, నిర్మాత, దర్శకత్వం: అశోక్‌ రెడ్డి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ద‌మ్ముంటే సొమ్మేరా`
 న‌టీన‌టులు: సంతానం, ఆంచ‌ల్ సింగ్‌, ఆనంద్‌రాజ్‌, క‌రుణాస్ త‌దిత‌రులు నిర్మాత : న‌ట‌రాజ్ బ్యాన‌ర్ : శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ సంగీతం :...
'ఐపీసీ సెక్షన్ భార్యాబంధు` అంద‌రికి నచ్చుతుంది!
ఆయన మొదట కెమెరామెన్ కావాలని కలలు కన్నారు. కుదరలేదు. దాంతో తనే సొంతంగా సినిమా నిర్మించే స్థాయికి ఎదగాలని డిసైడ్ అయి.. కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత...
`బెస్ట్ ల‌వ‌ర్స్` ప్రీ రిలీజ్ వేడుక‌...ఈనెల 8న గ్రాండ్ గా సినిమా విడుద‌ల!
శ్రీ క‌ర‌ణ్, అమృత‌, నిషా, దివ్య‌, ప్రీతి నాయ‌కానాయికలుగా శ్రీ కిర‌ణ్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై నంది వెంక‌ట రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీకాంత్ గొంట...
powered by RelatedPosts