మార్చి 1న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న నాగార్జున, కార్తీ, పి.వి.పి., వంశీ పైడిపల్లి ల ‘ఊపిరి’ ఆడియో

0

Oopiri Movie Still

మార్చి 1న గ్రాండ్‌గా రిలీజ్‌ అవుతున్న నాగార్జున, కార్తీ, పి.వి.పి., వంశీ పైడిపల్లి ల ‘ఊపిరి’ ఆడియో
‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబినేషన్‌లో పెరల్‌ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై ‘బృందావనం’ ‘ఎవడు’ వంటి సూపర్‌హిట్‌ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే నిర్మిస్తున్న భారీ మల్టీస్టారర్‌ ‘ఊపిరి’. షూటింగ్‌ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని మార్చిలో వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియోను మార్చి 1న చాలా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్‌ వి. పొట్లూరి మాట్లాడుతూ – ”మా ‘ఊపిరి’ చిత్రం ఆడియోను మార్చి 1న హైదరాబాద్‌లోని నోవాటెల్‌ హైటెక్స్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చేయబోతున్నాం. బృందావనం, ఎవడు వంటి సూపర్‌హిట్‌ చిత్రాల తర్వాత వంశీ పైడిపల్లికి డైరెక్టర్‌గా ఇది హ్యాట్రిక్‌ మూవీ అవుతుంది. మ్యూజిక్‌ పరంగా మంచి టేస్ట్‌ వున్న వంశీ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ గోపీసుందర్‌ నుంచి చాలా మంచి ట్యూన్స్‌ రాబట్టుకున్నారు. తప్పకుండా ఈ ఆడియో మరో మ్యూజికల్‌ హిట్‌ అవుతుంది. ఈ ఆడియో ఫంక్షన్‌ని రొటీన్‌కి భిన్నంగా నిర్వహించబోతున్నాం. ఈ మల్టీస్టారర్‌ మూవీ ఆడియో ఫంక్షన్‌కి టి.వి. సూపర్‌స్టార్‌ సుమ, గ్లామరస్‌ యాంకర్‌ అనసూయ యాంకర్లుగా వ్యవహరించనున్నారు. నాగార్జున, కార్తీ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ మల్టీస్టారర్‌పై చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్‌ వున్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌ని రీచ్‌ అయ్యేలా డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి చాలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి మార్చి నెలలోనే వరల్డ్‌వైడ్‌గా ‘ఊపిరి’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.
దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ – ”ఇద్దరు వేర్వేరు వ్యక్తుల మధ్య స్నేహబంధం ఎలా ఏర్పడింది? ఇద్దరూ కలిసి ఆ బంధాన్ని ఎలా కొనసాగించారు అనే కథాంశంతో అందర్నీ ఆకట్టుకునే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. గోపీసుందర్‌గారు చాలా అద్భుతమైన పాటలు అందించారు. సినిమాకి ఆడియో చాలా పెద్ద ప్లస్‌ అవుతుంది” అన్నారు.
కింగ్‌ నాగార్జున, ‘ఆవారా’ కార్తీ, తమన్నా భాటియా, సహజనటి జయసుధ, ప్రకాష్‌రాజ్‌, కల్పన, ఆలీ, తనికెళ్ళ భరణిలతోపాటు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్‌కు సంగీతం: గోపీసుందర్‌, పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, రామజోగయ్యశాస్త్రి, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.వినోద్‌, ఎడిటింగ్‌: మధు, ఫైట్స్‌: కలోయిన్‌ ఒదెనిచరోవ్‌, కె.రవివర్మ, సిల్వ, డాన్స్‌: రాజు సుందరం, బృంద, స్టోరీ అడాప్షన్‌: వంశీ పైడిపల్లి, సాల్మన్‌, హరి, మాటలు: అబ్బూరి రవి, ప్రొడక్షన్‌ డిజైనర్‌: సునీల్‌బాబు, సమర్పణ: పెరల్‌ వి.పొట్లూరి, నిర్మాతలు: పరమ్‌ వి.పొట్లూరి, కవిన్‌ అన్నే, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వంశీ పైడిపల్లి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న నాగార్జున, కార్తీల మల్టీస్టారర్ ‘ఊపిరి’
 సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కోట్ల క్లబ్‌లో చేరిన కింగ్‌ నాగార్జున, 'ఆవారా' కార్తీ, మిల్కీబ్యూటీ తమన్నా కాంబ...
నాగార్జునగారి యాక్టింగ్ చూసి చాలా మంది ఇన్ స్ఫైర్ అవుతారు - తమన్నా
 నాగార్జున , కార్తీ, తమన్నా కాంబినేష‌న్లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ ఊపిరి. తెలుగు, త‌మిళ్ లో వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ...
నాగార్జున, కార్తీ, పి.వి.పి., వంశీ పైడిపల్లి ల 'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల
నాగార్జున, కార్తీ, పి.వి.పి., వంశీ పైడిపల్లి ల 'ఊపిరి' షూటింగ్‌ పూర్తి - మార్చిలో విడుదల 'సోగ్గాడే చిన్ని నాయనా' వంటి సూపర్‌హిట్‌ చిత్రంతో 50 కో...
powered by RelatedPosts