'మాయ' చేస్తుంది!

0

Captureహర్షవర్థన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం’మాయ’. నీలకంఠ దర్శ కత్వం వహించారు. మధుర శ్రీధర్, ఎమ్.వి.కె.రెడ్డి, నిర్మాతలు. ఈ సినిమా ప్రచార చిత్ర ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఇన్ఫోసిస్ నరసింహారావు, పాలెం శ్రీకాంత్ రెడ్డి ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం పాలెం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ”కొత్తదనాన్ని, వైవిధ్యాన్ని కోరుకునే వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. వినూత్నంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఈ సినిమా కూడా అలాగే చేస్తున్నాడు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాను” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ”జరగబోయేది ముందే తెలిస్తే ఏమవుతుంది అనే అంశం మీద ఈ సినిమా నడుస్తుంది. తెలుగులో ఈ తరహాలో వస్తున్న తొలి చిత్రమిది. కథ, కథనం కొత్తగా ఉంటాయి” అన్నారు. మధుర శ్రీధర్ మాట్లాడుతూ ”తెలుగు సినిమా చరిత్రలో ఈ సినిమా ఉత్తమ థ్రిల్లర్‌గా నిలుస్తుంది. ఇంతటి వైవిధ్యమైన చిత్రాన్ని చేస్తున్నందుకు గర్విస్తున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతోపాటు వాసు, కళామందిర్ కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`అర్జున్ రెడ్డి` పోస్ట‌ర్ పై విరుచుకుప‌డ్డ వీ.హెచ్
విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిన అర్జున్ రెడ్డి ట్రైల‌ర్స్ ఇప్ప‌టికే యూ ట్యూబ్ లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. డిఫ‌రెంట్ కంటెంట్ తో తెర...
ఎన్టీఆర్ స‌ర‌స‌న కిట్టుగాడి హీరోయిన్!
 కిట్టు గాడు చిత్రంతో లైమ్ లైట్ లోకి వ‌చ్చింది అనుఇమ్యాన్యూయేల్. తొలి సినిమా మ‌జ్ను ప‌ర్వాలేద‌నిపించినా అమ్మ‌డికి అంత‌గా గుర్తింపు రాలేదు. అయితే ...
 వీళ్లిద్ద‌రు హ్యాపీ...కానీ ఆయ‌న‌కు మాత్రం తిప్ప‌లే!
ర‌ణ‌వీర్ సింగ్-దీపికా ప‌దుకునే డీప్ ల‌వ్ లో ఉన్న సంగతి  తెలిసిందే. ముంభై లో ప‌గ‌లు రాత్రి తేడాలేకుండా తిరిగేస్తున్నారు. మీడియాకు అడ్డంగా దొరికిపో...
powered by RelatedPosts