"మాయ" కాన్సెప్ట్ ట్రైలర్ విడుదల

0

 

హర్షవార్ధం రాణీ, అవంతిక, సుష్మా నటీనటులుగా షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాయ’. ఈ చిత్రానికి డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మాతలు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ రోజు (14.6.2014) ఈ సినిమా కాన్సెఫ్ట్ ట్రైలర్ ఆవిష్కరణ ప్రసాద్ ప్రివ్వ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, కళామందిర్ కళ్యాణ్, పాలెపు శ్రీకాంత్ రెడ్డి, నరసింహరావు, మల్టీడైమ్షన్ వాసు, రఘు కుంచె తదితరులతో పాటు ఈ చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

పాలెపు శ్రీకాంత్ రెడ్డి, నరసింహరావు ట్రైలర్ ని ఆవిష్కరించి చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ – ”జరగబోయేది ముందు కనబడితే అనే కాన్సెఫ్ట్ తో సినిమా చేయాలనే ప్లాన్ నాకు ఎప్పట్నుంచో ఉంది. దాంతో ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి చేసాను. మన పెద్దలు సైన్స్ కు అందని టెలిపతిలాంటి చాలా విషయాలను మనకు తెలియజేసారు. తెలుగులో ఇలాంటి కాన్సెఫ్ట్ తో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే అని ఖచ్చితంగా చెప్పగలను. కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ధ్రిల్ కు గురి చేయడం ఖాయం” అని తెలిపారు.

హీరో హర్షవర్ధన్ రానే మాట్లాడుతూ – ”ఇలాంటి మంచి సినిమాని చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. చాలా బాగుంది. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్, అనితాచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ – పి.బాల్ రెడ్డి, ఎడిటింగ్ – నవీన్ మాలి, ఆర్ట్ – బాబ్జి, నిర్మాతలు – డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర రెడ్డి, రచన, దర్శకత్వం – నీలకంఠ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చిలో భ‌ర‌త్ టీజ‌ర్
సూపర్ స్టార్ మహేష్ బాబు , కొర‌టాల శివ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న ‘భరత్ అనే నేను’ ఏప్రిల్ 20న విడుద‌ల‌కు ముహూర్తం కుదిర్చిన సంగ‌తి తెలిసిందే. ...
భార‌తీయుడు సీక్వెల్ లో సింగం
విశ్వ‌న‌టుడు కమల్‌హాసన్ ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డంతో క‌మిట్ అయిన సినిమాలను త్వ‌రిగ‌తిన పూర్తిచేసే పనిలో పడ్డారు. ‘విశ్వరూపం 2’ సినిమా చివరి దశ పనుల...
హాట్ స‌మ్మ‌ర్ లో సెగ‌లు పెంచే సినిమాలు
2018 వేస‌విని మ‌రింత హీటెక్కించ‌డానికి టాలీవుడ్ స్టార్ హీరోలు రెడీ అయిపోతున్నారు. వ‌రుసుగా టాప్ స్టార్లంద‌రూ ఒక‌రి త‌ర్వాత ఒకరి బ‌రిలోకి దిగిపోతు...
powered by RelatedPosts