"మాయ" కాన్సెప్ట్ ట్రైలర్ విడుదల

0

 

హర్షవార్ధం రాణీ, అవంతిక, సుష్మా నటీనటులుగా షిరిడి సాయి కంబైన్స్ పతాకంపై నీలకంఠ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘మాయ’. ఈ చిత్రానికి డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర్ నిర్మాతలు. ఈ చిత్రానికి శేఖర్ చంద్ర సంగీతం అందించారు. ఈ రోజు (14.6.2014) ఈ సినిమా కాన్సెఫ్ట్ ట్రైలర్ ఆవిష్కరణ ప్రసాద్ ప్రివ్వ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజ్ కందుకూరి, కళామందిర్ కళ్యాణ్, పాలెపు శ్రీకాంత్ రెడ్డి, నరసింహరావు, మల్టీడైమ్షన్ వాసు, రఘు కుంచె తదితరులతో పాటు ఈ చిత్రం యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

పాలెపు శ్రీకాంత్ రెడ్డి, నరసింహరావు ట్రైలర్ ని ఆవిష్కరించి చిత్రం యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసారు.

అనంతరం డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ – ”జరగబోయేది ముందు కనబడితే అనే కాన్సెఫ్ట్ తో సినిమా చేయాలనే ప్లాన్ నాకు ఎప్పట్నుంచో ఉంది. దాంతో ఈ చిత్రాన్ని ఎంతో ఇష్టపడి చేసాను. మన పెద్దలు సైన్స్ కు అందని టెలిపతిలాంటి చాలా విషయాలను మనకు తెలియజేసారు. తెలుగులో ఇలాంటి కాన్సెఫ్ట్ తో రూపొందుతోన్న తొలి సినిమా ఇదే అని ఖచ్చితంగా చెప్పగలను. కథ, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ధ్రిల్ కు గురి చేయడం ఖాయం” అని తెలిపారు.

హీరో హర్షవర్ధన్ రానే మాట్లాడుతూ – ”ఇలాంటి మంచి సినిమాని చేసే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ట్రైలర్ చూసి షాక్ అయ్యాను. చాలా బాగుంది. సినిమా విడుదల కోసం ఎదురు చూస్తున్నాను” అన్నారు.

ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తపరిచారు.

నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు

హర్షవర్ధన్ రాణే, అవంతిక, సుష్మ, నందినిరాయ్, అనితాచౌదరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం – శేఖర్ చంద్ర, సినిమాటోగ్రఫీ – పి.బాల్ రెడ్డి, ఎడిటింగ్ – నవీన్ మాలి, ఆర్ట్ – బాబ్జి, నిర్మాతలు – డా.యం.వి.కె.రెడ్డి, మధుర శ్రీధర రెడ్డి, రచన, దర్శకత్వం – నీలకంఠ.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్  `య‌మ్6` ట్రైల‌ర్ లాంచ్‌!!
  విశ్వ‌నాథ్ ఫిలిం ఫ్యాక్ట‌రి, శ్రీల‌క్ష్మి వెంక‌టాద్రి క్రియేష‌న్స్ బేన‌ర్స్ పై  విశ్వ‌నాథ్ త‌న్నీరు, సురేష్‌.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తోన...
హైద‌రాబాద్ ల‌వ్ స్టోరీ
 ముందుమాట‌: రాహుల్ ర‌వీంద్ర‌న్, ర‌ష్మీ మీన‌న్, మ‌ధుల‌జ్ఞ‌దాస్ జంట‌గా ఎస్ ఎన్ ఆర్ ఫిలిమ్స్ పతాకంపై రాజ్ స‌త్య ద‌ర్శ‌క‌త్వంలో ఎస్ ఎన్ రెడ్...
‘47డేస్’ మూవీ కి ఓవర్సీస్ లో డిమాండ్
సత్యదేవ్, పూజా ఝవేరీ, రోషిణి ప్రకాష్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 47డేస్. ద మిస్టరీ అన్ ఫోల్డ్స్ అనేది ఉపశీర్షిక. సస్పెన్స్ థ్రిల్లర్ గా తె...
powered by RelatedPosts