మాఫియా డాన్ ప్రేమకథ

0

First-Look--Explosive-Samantha-in-Anjaan--186రాజు భాయ్ అనే ఓ మాఫియా డాన్ నేపథ్యంలో సాగే కథ ఇది. సూర్య పాత్ర చిత్రణతో పాటు అతని వేషధారణ కూడా కొత్తగా వుంటుంది. రాజు అనే ఓ యువకుడు భాయ్‌గా ఎందుకు మారాడన్నదే ఇందులో ఆసక్తికరం. ముంబై నేపథ్యంలో కథ సాగుతుంది అంటున్నారు ఎన్.లింగుస్వామి. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం అంజాన్. సూర్య, సమంతా జంటగా నటిస్తున్నారు. తిరుపతి బ్రదర్స్ పతాకంపై ఎన్.సుభాష్‌చంద్రబోస్, రోనీస్క్రూవాలా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఎన్.లింగుస్వామితో కలిసి లగడపాటి శిరీష, శ్రీధర్ ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. తెలుగు వెర్షన్‌కు సికిందర్ అనే పేరుని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ఇప్పటి వరకు వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న సూర్య ఈ సినిమాలో మరింత ైస్టెలిష్‌గా డాన్ పాత్రలో కనిపించబోతున్నారు. సమంతా గ్లామర్ ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బీచ్‌లో సూర్య, సమంతాలపై చిత్రీకరించిన పాట ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. సూర్య నటన, యువన్‌శంకర్‌రాజా సంగీతం, సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. చిత్రాన్ని రెండు భాషల్లో ఆగస్టు 15న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts