మాతృభాషలో మొదటిసారిగా ముద్దుగుమ్మ

0

sushmita-senతెలుగు,తమిళం, హింది,ఇంగ్లీష్ భాషల్లో పలు విభిన్నమైన పాత్రలు పోషించి, ప్రపంచవ్యాప్తంగా చక్కటి గుర్తింపుని పొందిన మాజీ విశ్వసుందరి, ప్రముఖ నటి సుస్మిత సేన్ ఇంతవరకు తన మాతృభాష అయిన బెంగాలీలో ఒక్క సినిమా కూడా చేయలేదు అంటే ఆశ్చర్యమే కదూ?
మొదట్లో బెంగాలీలో చేయాలంటే నాకు కాస్త బెరుకుగా ఉండేది అని చెప్పే సుస్మిత కి, ఇన్నాళ్ళకి తన మాతృభాషలో సినిమా చేసే అవకాశం సుస్మిత తలుపు తట్టింది. జాతీయ అవార్డు గ్రహీత సృజిత్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కనున్న బెంగాలీ చిత్రం ‘నిర్బాక్’లో మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ నటించనుంది. ఈ చిత్రం షూటింగ్ కోసం నాలుగు రోజుల్లో కోల్‌కతా బయలుదేరనున్నట్లు ఆమె చెప్పింది.

బెంగాలీ భామ అయిన సుస్మితకు మాతృభాషలో ఇదే మొదటి చిత్రం కావడం విశేషం. తమిళ, తెలుగు వంటి ఏ ఇతర భాషా చిత్రాల్లోనైనా బెరుకు లేకుండా నటించిన తనకు బెంగాలీ చిత్రాలంటే ఇదివరకు కాస్త బెరుకు ఉండేదని, ఇప్పుడు దాన్ని అధిగమించానని సుస్మితా చెబుతుండటం విశేషం.

రచ్చ గెలిచిన ఈ సుందరి ఇప్పుడు ఇంత గెలిచేనో లేదో వేచి చూడాలి మరి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
శ్రీకాంత్ హీరోగా ప్రారంభ‌మైన `పెళ్ళంటే` చిత్రం
శ్రీకాంత్, శాలు చౌర‌శియా, మ‌మ‌తా చౌద‌రి, జెబా అన్స‌మ్ నాయ‌కానాయిక‌లుగా న‌టిస్తున్న‌ `పెళ్ళంటే`...? అనే కొత్త చిత్రం ఆదివారం ఉద‌యం హైద‌రాబాద్ ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
powered by RelatedPosts